ఈ ఏడాది డిసెంబర్ నెల మన తెలుగు చిత్రసీమకు పెద్దగా అచ్చిరాలేదనుకొంటా. ఒకటి కాదు, రెండు కాదు ఈనెల విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తాకొట్టాయి. “ఆపరేషన్ 2019″తో మొదలైన ఈ నెల సినిమాల ప్రవాహం.. “కవచం, సుబ్రమణ్యపురం, నెక్స్ట్ ఏంటీ, శుభలేఖలు, భైరవగీత, హుషారు, ఒడియన్, అంతరిక్షం, పడి పడి లేచే మనసు, మారి 2” చిత్రాలతో కంటిన్యూ అయ్యింది. ఒక్క “హుషారు” మినహా మిగతా చిత్రాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. ఇక వచ్చేవారం విడుదలకానున్న “బ్లాఫ్ మాస్టర్, ఇదం జగత్” మీద భారీ స్థాయి అంచనాలు లేవు.
ఈ రెండు సినిమాలు కూడా పొరపాటున కాస్త అటు ఇటు అయ్యాయి అంటే.. ఈ ఆఖరి నెల తెలుగు చిత్రసీమకు ఓ చేదు జ్ణాపకంగా మిగిలిపోతుంది. అయితే.. వచ్చే నెల సంక్రాంతి సంరంభంలో కొత్త సినిమాలు ఎలాగో ఉన్నాయి కాబట్టి ప్రేక్షకుల ఎంటర్ టైన్ మెంట్ కు ఎలాగూ అడ్డు లేదనుకోండి. అయితే.. ఈ ఇయర్ మన తెలుగు సినిమాల సక్సెస్ రేట్ కాస్త తక్కువనే చెప్పాలి. కానీ.. హిట్ అయిన కొన్ని సినిమాలు మాత్రం తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళాయి