Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి
- March 22, 2026 / 08:15 PM ISTByPhani Kumar
సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ అంటూ సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్.. ఈ సమ్మర్ కి ‘బైకర్'(Biker) గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Biker
అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. సీనియర్ హీరో రాజశేఖర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ని వదిలారు.

‘బైకర్’ ట్రైలర్ 2 నిమిషాల 54 సెకన్ల నిడివి కలిగి ఉంది.’మన ఇండియన్ రేసర్లు ఇంటర్నేషనల్ ట్రాక్స్‌పై పోటీ పడగలరా?’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఇందులో వికాస్ నారాయణ్ అలియాస్ విక్కీ అనే పవర్ ఫుల్ రేసర్ పాత్రలో శర్వానంద్ కనిపించనున్నాడు.మరోవైపు డాక్టర్ రాజశేఖర్ పాత్రని కూడా పరిచయం చేశారు. ఇందులో ఆయన శర్వానంద్‌కి తండ్రిగా అలాగే అతనికి కోచ్ గా కనిపించనున్నారు. కానీ అతనికి కొడుకు కంటే రేసింగ్ అంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు.. అందువల్ల కొడుకు పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చూపించారు.
‘తండ్రికి విక్కీ కొడుకు కాదు, కేవలం ఒక రేసర్ మాత్రమే’ అంటూ హీరోయిన్ పలికే డైలాగ్ తో ఆ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు.’రేసింగ్ అంటే కేవలం వేగం మాత్రమే కాదు.. డిసిప్లిన్, టెక్నిక్ మరియు కంట్రోల్ ఉండాలని’ ‘అహంకారానికి ఇక్కడ చోటు లేదు.. ఆట కంటే ఏదీ ఎక్కువ కాదు’ అంటూ వచ్చే డైలాగ్స్ ని బట్టి రాజశేఖర్ రోల్ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్దం చేసుకోవచ్చు. ఈ సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ కి పెద్ద పీట వేశారని కూడా చెప్పాలి.
‘ఇది వేగం గురించి కాదు.. ఇది గౌరవం గురించి’ అంటూ హీరో శర్వానంద్ చెప్పే డైలాగ్ ని బట్టి.. తండ్రి(రాజశేఖర్) కొడుకు పిరికోడని భావించి వదిలేసినట్టు అర్దం చేసుకోవచ్చు. ట్రైలర్లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ టాప్ నాచ్ లో ఉన్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :












