Billa Trailer: ట్రెండింగ్ లో ‘బిల్లా’ 4K ట్రైలర్..!

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజుకి ఆకాశమే హద్దు అనేలా సంబరాలు ప్లాన్ చేస్తున్నారు ఫ్యాన్స్. అక్టోబర్ 23 ఆదివారం కావడంతో ఈ వీకెండ్ మొత్తం ప్రభాస్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్లతో ట్విట్టర్ లో రికార్డ్ రేంజ్ లో ట్రెండ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే డార్లింగ్ బర్త్ డే సీడీపీ వైరల్ అవుతోంది. ఇప్పుడు స్పెషల్ షోల మీద పడ్డారు ఫ్యాన్స్. ప్రభాస్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బిల్లా’ 4K వెర్షన్ రెడీ చేశారు.

13 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మూవీని డిజటలైజేషన్ చేసి, కలర్ గ్రేడింగ్ తో పాటు 4K లోకి రీస్టోరేషన్ చేసి, క్యూబ్ లోకి కన్వర్ట్ చేశారు. పిక్చర్ క్వాలిటీ అదిరిపోయిందంటూ డైరెక్టర్ మెహర్ రమేష్ ట్వీట్ చేసాడు. అక్టోబర్ 23 (ఆదివారం) ఉదయం 8 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్ తో పాటు కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ లోనూ స్పెషల్ షోస్ వేస్తున్నారు. రీసెంట్ గా ‘బిల్లా’ ట్రైలర్ రిలీజ్ చేశారు.

తమిళ్ లో అజిత్ నటించగా సూపర్ హిట్ అయిన ‘బిల్లా’ను ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు సమర్పణలో గోపికృష్ణా మూవీస్ బ్యానర్ మీద ప్రభాస్ సోదరుడు ప్రభోద్ తో కలిసి నరేంద్ర నిర్మించారు. 2009 సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేశారు. అనుష్క, నమిత, హన్సిక, కృష్ణంరాజు, జయసుధ, ఆదిత్య మీనన్, కెల్లీ డోర్జీ, అలీ, సుప్రీత్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

4K లో కట్ చేసిన ట్రైలర్ క్వాలిటీగా బాగుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘బిల్లా’ న్యూ ట్రైలర్ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకి మణిశర్మ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యాయి. బిల్లా, రంగాగా ప్రభాస్ డ్యుయల్ రోల్ లో ఆకట్టుకున్నాడు. దీంతోపాటు ‘వర్షం’ కూడా రీ రిలీజ్ చెయ్యాలనుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల నవంబర్ 11కి వాయిదా వేశారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus