Billa Movie: హైదరాబాద్ లో ‘బిల్లా’ 4K స్పెషల్ షోస్ ఏ థియేటర్లలో అంటే..?

తమ ఫేవరెట్ హీరోల సినిమా రిలీజ్ అప్పుడు హంగామా చెయ్యడం.. మూవీ అప్ డేట్స్, బర్త్ డేస్ అప్పుడు డిఫరెంట్ హ్యాష్ ట్యాగ్స్ తో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చెయ్యడం.. స్పేస్ లో ఫ్యాన్స్ అంతా ముచ్చట్లు పెట్టడం.. ఇప్పటివరకు ఇలాంటవన్నీ చూశాం.. తమ అభిమాన హీరోల పుట్టినరోజులకి, సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భాల్లో స్పెషల్ షోస్ వేయడం అనే నయా ట్రెండ్ ఈమధ్యే స్టార్ట్ అయ్యింది.

ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేకి ‘పోకిరి’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ‘జల్సా’, నటసింహ నందమూరి బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రి రిలీజ్ చెయ్యడం.. ఈ సినిమాలన్నీ కూడా ఒకదాన్ని మించి మరొకటి రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం చూశాం.. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ వంతు వచ్చింది. ‘బాహుబలి’ ముందు వరకు డార్లింగ్ కేవలం మన టాలీవుడ్ రెబల్ స్టార్..

తర్వాత పాన్ ఇండియా స్టార్.. ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ.. గ్లోబల్ అంతా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా మారే స్థాయిలో ‘ప్రాజెక్ట్ – K’ తెరకెక్కుతోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్లో పెడుతున్నాడు.. ఇలా ఈ ఏడాది ప్రభాస్ పుట్టినరోజుకి చాలా ప్రత్యేకతలున్నాయి. దీంతో ఫ్యాన్స్ ప్రభాస్ నటించిన పలు సినిమాలను స్పెషల్ షోస్ వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్రభాస్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బిల్లా’ 4K వెర్షన్ రెడీ చేశారు.

13 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ మూవీని డిజటలైజేషన్ చేసి, కలర్ గ్రేడింగ్ తో పాటు 4K లోకి రీస్టోరేషన్ చేసి, క్యూబ్ లోకి కన్వర్ట్ చేశారు. పిక్చర్ క్వాలిటీ అదిరిపోయిందంటూ డైరెక్టర్ మెహర్ రమేష్ ట్వీట్ చేసాడు. అక్టోబర్ 23 (ఆదివారం) ఉదయం 8 గంటలకు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి థియేటర్ తో పాటు కూకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ లోనూ స్పెషల్ షోస్ వేస్తున్నారు. టికెట్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి..

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus