బిగ్ బాస్ హౌస్ నాన్ స్టాప్ ఓటీటీ సీజన్ 1 అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 5వ వారం నామినేషన్స్ లో ఉన్నవారికి ఒక అవకాశం ఇస్తూ వివిధ ఛాలెంజస్ టాస్క్ లని ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గెలిచినవారు సేఫ్ జోన్ లోకి వెళ్తే, సేఫ్ జోన్ లో ఉన్నావారిలో ఒకరు వారి ఏకాభిప్రాయంతో ఒకర్ని స్వాప్ చేయాల్సి ఉంటుంది. అంటే వారిలో ఒకరు నామినేట్ అవుతారు అన్నమాట. ఫస్ట్ రౌండ్ లో బెలూన్స్ ని చేతిలో పట్టుకుని కాపాడుకున్నారు హౌస్ మేట్స్. ఇందులో భాగంగా అషూరెడ్డి చివరి వరకూ ఉండి, ఇమ్యూనిటీని సాధించింది.
ఇక నటరాజ్ మాస్టర్ కెప్టెన్ గా , సంచాలక్ గా డెసీషన్ తీస్కున్నారు. ఏకాభిప్రాయంతో స్రవంతిని స్వాప్ చేశారు. ఇక్కడి వరకూ కథ బాగానే నడించింది. రెండో ఛాలెంజ్ వచ్చేసరికి బిందుమాధవి సేఫ్ జోన్ లోకి వచ్చింది. తనకి ఇష్టమైన చెప్పుల జతలని పెయింటింగ్ లో ముంచి టాస్క్ లో విజయం సాధించింది. దీంతో బిందుని స్వాప్ చేసుకోవడానికి సేఫ్ జోన్ లో ఉన్నవారు చాలా కష్టపడ్డారు. స్వాప్ ద్వారా సేఫ్ అయ్యింది కాబట్టి, అషూరెడ్డిని మళ్లీ పంపించాలని చూశారు. కానీ, దీనికి అషూరెడ్డి ఒప్పుకోలేదు. ఫైట్ చేసింది.
హౌస్ మేట్స్ మెజారిటీ ఓటింగ్ మాత్రం అషూరెడ్డికి వేశారు. కానీ, నటరాజ్ మాస్టర్ మాత్రం తేజస్వి ని స్వాప్ చేసి షాక్ ఇచ్చారు.హౌస్ మేట్స్ అందరూ అషూరెడ్డి మరోసారి నామినేషన్స్ లోకి వస్తుందనే అనుకున్నారు. కానీ, మాస్టర్ పర్సనల్ గా తీస్కుని తేజుని నామినేట్ చేసేశారు. దీంతో సెకండ్ రౌంట్ లో బిందుమాధవి సేఫ్ అయ్యింది. ఆ తర్వాత మూడో రౌండ్ లో బ్యాలన్సింగ్ టాస్క్ ని చివరి వరకూ పూర్తి చేసిన మహేష్ విట్టా సేఫ్ అయ్యాడు. ఇక్కడే నటరాజ్ మాస్టర్ బిందుమాధవిని స్వాప్ చేయాలని చూశారు.
కానీ, బిందుమాధవి దీనికి ఒప్పుకోలేదు. అంతేకాదు, చాలాసేపు ఆర్గ్యూమెంట్ చేసింది మాస్టర్ కి ఫుల్ క్లాస్ పీకింది. ఇక్కడే అఖిల్ కూడా ఎందుకు నామినేట్ అవ్వడు అంటూ ప్రశ్నించింది. బిందు మాధవి స్వాపింగ్ కి అస్సలు ఒప్పుకోలేదు. లాస్ట్ మినిట్ వరకూ కూడా ఆర్గ్యూమెంట్ చేస్తునే ఉంది. అంతేకాదు, నామినేషన్ బ్యాడ్జిని కూడా పెట్టుకోలేదు. దీంతో బిగ్ బాస్ మరోసారి నటరాజ్ మాస్టర్ ని స్వాప్ చేసే వ్యక్తి ఎవరో చెప్పమని అడిగేసరికి మాస్టర్ బిందుమాధవి పేరు చెప్పాడు.
టాస్క్ ఆడి సేఫ్ అయిన బిందుమాధవి మరోసారి నామినేషన్స్ లోకి రావాల్సి వచ్చింది. తనకిష్టమైన చెప్పుల జతలు కూడా పోయాయి. అయినా కూడా నామినేషన్స్ లో ఉంది. నటరాజ్ మాస్టర్ సంచాలక్ గా పూర్తిగా విఫలం అయ్యారు. తేజస్వి విషయంలో, అలాగే బిందుమాధవి విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోయారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?