బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం నామినేషన్స్ హీటెక్కిపోయాయి. హౌస్ మేట్స్ దిష్టిబొమ్మల పైన కుండని పెట్టి దాన్ని పగలగొట్టి మరీ వారి వల్ల తమ గేమ్ ఎలా డిస్టర్బ్ అయ్యిందో చెప్తూ ఒక్కో హౌస్ మేట్ ఇద్దరిని నామినేట్ చేశాడు. ఈ నామినేషన్స్ లో ఎప్పటిలాగానే మిత్రా శర్మా ఓవర్ డ్రామా క్రియేట్ చేసింది. బిందుని నామినేట్ చేస్తూ టాస్క్ లో ముగ్గురు తనని ఎటాక్ చేశారని, బ్యాక్ పైయిన్ ఉన్నా కూడా భరించానని చెప్పింది. ఇక్కడే బిందుకి అస్సలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.
మరోసారి సీన్ లోకి బ్యాక్ పెయిన్ ఇష్యూ వచ్చింది. ఇక్కడే సహనాన్ని కోల్పోయిన బిందు మిత్రా శర్మా మీదకి వచ్చింది. రెండు చేతులతో తలని పట్టుకుని మరీ ఎక్స్ ప్లనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా మిత్రా శర్మా బిందు మాటలని పట్టించుకోలేదు. తను చెప్పాలనుకున్న పాయింట్ ని మాత్రం చెప్పేసింది. ఇక్కడే బిందు నువ్వు వేరేవాళ్లు చెప్పినట్లుగా ఉంటున్నావని , వారి మాటలు ఇక్కడ చెప్పద్దని అఖిల్ ని ఉద్దేశ్యించి చెప్పింది. మిత్రాశర్మా బిందుని ఎక్కడికక్కడ లాక్ చేస్తూ తన లాజిక్ పాయింట్స్ ని మాట్లాడింది.
ఫస్ట్ వీక్ నుంచీ మిత్రా డ్రామా చేస్తోందని, అసలు ఫేక్ ఏదో, డ్రామా ఏదో మిగతా వాళ్లకి ఎలా తెలుస్తుందని ఆర్గ్యూమెంట్ చేసింది. ఇక తను ఇమేజ్ క్రియేట్ చేస్తుంది మనిషికోసం అంటూ మిత్రా బిందుకి మాటకి మాట చెప్పింది. ఇలా ఇద్దరూ వాగ్వివాదం చేసుకున్నారు. అసహనంతో బిందు చాలాసేపు వాదించి మిత్రా దగ్గరకి వచ్చి మరీ వివరణ చెప్పే ప్రయత్నం చేసింది. ఇక్కడే తనతో మాట్లాడకుండా వేరే వైపు చూస్తూ మాట్లాడుతోంది బిందు తన దగ్గరికి వచ్చి ఫేస్ ని పట్టుకుని మాట్లాడింది.
అయితే, ఇక్కడే మిత్రా ఇంకా బిందుని రెచ్చగొడుతూనే ఉంది. అంతకుముందు యాంకర్ శివని నామినేట్ చేస్తూ కూడా లాజిక్ పాయింట్స్ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఎందుకంటే, మిత్రాని శివ నామినేట్ చేస్తూ ఐదు నిమిషాలు టైమ్ ఇవ్వలేదని గతంలో నామినేట్ చేసావని గుర్తు చేసి మరీ నామినేట్ చేశాడు శివ. దానికి కౌంటర్ గా మిత్రా శివని మాట్లాడనివ్వకుండా మరీ రెచ్చగొట్టింది. మిత్రా నామినేషన్స్ తర్వాత ఈసారి నిజంగా తెలియాలి అని, నేను నిజంగా బ్యాడ్ అయితే హౌస్ నుంచీ వెళ్లిపోతానని సీరియస్ గా చెప్పింది.
అలాగే, నేను గేమ్ సరిగ్గా ఆడకపోతే నాగార్జున గారు 300 పర్సెంట్ ఆడావని అనేవారు కాదని గుర్తు చేసింది మిత్రా. ఏది ఏమైనా ఈ వారం నామినేషన్స్ లో మిత్రా ఓవర్ డ్రామా క్రియేట్ చేసి హైలెట్ అయ్యింది.