Bithiri Sathi: బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

న్యూస్ ఛానెళ్లలోని ప్రోగ్రామ్ ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వాళ్లలో బిత్తిరి సత్తి ఒకరనే సంగతి తెలిసిందే. తెలుగులోని వేర్వేరు న్యూస్ ఛానళ్లలో పని చేసిన బిత్తిరి సత్తి ఆయా ఛానళ్లలోని ప్రోగ్రామ్ ల ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం పెద్ద సినిమాల హీరోలను ఇంటర్వ్యూ చేయడం ద్వారా బిత్తిరి సత్తి మరింత పాపులర్ అవుతుండటం గమనార్హం. ప్రస్తుతం బిత్తిరి సత్తి ఒక్కో షోకు 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

టాలీవుడ్ టాప్ యాంకర్ల రెమ్యునరేషన్లతో పోల్చి చూస్తే బిత్తిరి సత్తి రెమ్యునరేషన్ ఎక్కువ కావడం గమనార్హం. మహేష్ బాబును, వెంకటేష్ వరుణ్ తేజ్ లను ఇంటర్వ్యూ చేయడం ద్వారా బిత్తిరిసత్తి ఈ మధ్య కాలంలో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. సినిమాలను ప్రమోట్ చేస్తూ బిత్తిరి సత్తి క్రేజ్ ను పెంచుకుంటున్నారు. ఇతర ఇంటర్వ్యూలతో పోల్చి చూసి బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు డిఫరెంట్ గా ఉండటంతో పాటు బిత్తిరిసత్తి ఇంటర్వ్యూలపై ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం బిత్తిరిసత్తి న్యూస్ ఛానెళ్లకు దూరంగా ఉంటూ ఇంటర్వ్యూలు చేయడాన్నే కెరీర్ గా మలచుకున్నారు. బిత్తిరి సత్తి కెరీర్ విషయంలో మరింత ఎదగాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిత్తిరి సత్తిని అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. బిత్తిరి సత్తికి ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం సిద్ధపడుతున్నారు. ఇంటర్వ్యూల ద్వారా ఆదాయం కూడా పెరగడంతో బిత్తిరి సత్తి సంతృప్తిని వ్యక్తం చేశారని తెలుస్తోంది.

బిత్తిరి సత్తికి సినిమా ఆఫర్లు కూడా వస్తుండగా సినిమా ఆఫర్ల విషయంలో బిత్తిరి సత్తి ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. అయితే బిత్తిరి సత్తి న్యూస్ ఛానెళ్లకు దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus