Tollywood: హైదరాబాద్‌లో స్టార్‌ హీరోలకు ‘బ్లాక్‌ ఫిల్మ్‌’ షాక్‌!

మామూలు మనుషులు చెప్పే కన్నా… హీరోలు చెబితే ఎక్కువమంది వింటారు. అందులో ఏ కొంతమంది ఆచరించినా చాలు మన లక్ష్యం కొంతలో కొంత నెరవేరినట్లు అనుకుంటూ ఉంటారు. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు, ఆలోచనల్ని హీరోలతో చెప్పిస్తుంటారు. అలాంటి హీరోలు ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకపోతే, ఆ పట్టించుకోకపోవడానికి హీరోయిజం అనుకుంటే.. దానిని ఏమంటారు. కార్ల అద్దాలకు ‘బ్లాక్‌ ఫిల్మ్‌’ గురించి మాట్లాడాలనే ఇదంతా చెబుతున్నాం. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో సినిమా హీరోల కార్లను పోలీసులు అడ్డుకుంటున్నారు.

Click Here To Watch NOW

ఆ కార్ల అద్దలకు ఉన్న బ్లాక్‌ స్టిక్కర్లు, ఫిల్మ్‌లను తొలగిస్తున్నారు. అంతేకాదు వారిని నుండి ఫైన్‌ కూడా వసూలు చేస్తున్నారు. ఇలా ఫైన్లు చెల్లించినవారిలో ఇటీవల కాలంలో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌ రామ్‌, మంచు మనోజ్‌ ఉన్నారు. వీరంతా గతంలో కొన్ని సందర్భాల్లో బాధ్యతలు, విలువలు అంటూ లెక్చర్లు ఇచ్చినవాళ్లే. మరి వాళ్లే ఇలా ప్రభుత్వ నిబంధనలను పాటించకపోవడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. నిజానికి ఇప్పటివరకు దొరికిన నటుల కార్లు – బ్లాక్‌ ఫిల్మ్‌లు చాలా తక్కువే.

ఎందుకంటే వీళ్ల కార్లు రోడ్డు మీద దొరికాయి కాబట్టి. డోర్‌ టు డోర్ వెళ్లి నటుల కార్లు చెక్‌ చేస్తే ఇలాంటి వాళ్లు చాలామంది కనిపిస్తారు అనేది సోషల్‌ మీడియా చర్చల సారాంశం. వాళ్ల రక్షణ కోసమో, ప్రైవసీ కోసమో ఇలా చేసి ఉండొచ్చు. అయితే నిబంధనలు ఎవరికైనా నిబంధనలే కదా అని గుర్తుకు తెచ్చుకోవాలి అని కోరుతున్నారు నెటిజన్లు. అయితే కార్లకు బ్లాక్‌ ఫిల్మ్‌లు తొలగించాలనే రూల్‌ ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల క్రితం న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి.

అప్పట్లో ఆచరించినవాళ్లు ఇప్పుడు పెడచెవిన పెడుతున్నారు. మొన్నీమధ్య ఓ హీరో కారుకు బ్లాక్‌ ఫిల్మ్ తొలగిస్తుంటే ఎవరో ఫొటో తీశారు. ఆ సమయంలో ఆయన నవ్వులు చిందిస్తూ పోజిచ్చాడు. ఏం ఘనకార్యం సాధించాడనో అంత నవ్వు. రూల్‌ పాటించలేదనా, లేక అలా ఉండి తన ఫ్యాన్స్‌కు ఆదర్శంగా నిలిచాడనా? ఏమో మరి ఆయనే తెలియాలి.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus