చిన్న సినిమాలు… పెద్ద హిట్స్!!!

  • March 3, 2016 / 07:04 PM IST

అసలే పరీక్షల సీజన్ వచ్చేస్తుంది, ఎలాగూ పెద్ద సినిమాలు లేవు, ఇంక చేసేది ఏముంది, ఎంతో కష్టపడి తీసిన చిన్న సినిమాలు అన్నీ క్యూ కట్టేసాయి. ఒకటా..రెండా దాదాపుగా 7 సినిమాలు గత శుక్రవారం విడుదలయ్యాయి. అందులో రెండు సినిమాలు డబ్బింగ్ బ్యాచ్ కాగా, మిగిలినవి స్ట్రేట్ తెలుగు సినిమాలు…ఇక సినిమాల వివరాల్లోకి వెళితే…యమపాశం, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ డబ్బింగ్ సినిమాలు. క్షణం, పడేసావె, టెర్రర్, ఎలుకా మజాకా, వీరి వీరి గుమ్మడిపండు ఇవన్నీ తెలుగు సినిమాలు. అయితే వాటి లెక్కలను ఒక్కసారి చూస్తే…ముందుగా డబ్బింగ్ సినిమాల లెక్కల్లోకి వెళితే..యమపాశం గురించి చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ… ఈ సినిమా పెద్దగా ఏమీ లేదు, దానికి కారణం జయం రవికి ఇక్కడ మార్కెట్ లేకపోవడమే.

ఇక గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, దాన్ని నచ్చి చూసే వాళ్ళు దానికి ఉన్నారు ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే….పడేసావె సినిమాకు భారీగా ప్రమోషన్ అందించాడు నాగ్, బట్ ప్రమోషన్ లో ఉన్న పస, సినిమాలు లేదు. బ్రహ్మానందం – వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎలుకా మజాకా’ ను పట్టించుకునే నాధుడే లేడు. వీరి వీరి గుమ్మడిపండు సినిమాను సైతం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక మిగిలిన వాటిల్లో  క్షణం, టెర్రర్ రెండు చిత్రాలు అనుకోని విధంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండు సినిమాల టాక్ పాజిటివ్ గా ఉండడంతో హిట్ ఖాతాలోకి వెళ్ళాయి. అయితే ఈ రెండు చిత్రాల్లో టెరర్ సంగతి కొంచెం అగమ్య గోచరంగా ఉంది ఎందుకంటే…దీనికి చాలా తక్కువ థియేటర్లిచ్చారు. సరిగా పబ్లిసిటీ కూడా చేయలేదు. మంచి టాక్ వచ్చినా దాన్ని కూడా సరిగా ఉపయోగించుకోవట్లేదు. పబ్లిసిటీ బాగా చేసి థియేటర్లు పెంచితే పెట్టుబటి రాబట్టుకునే అవకాశాలున్నాయి. ఇలా గత వారం విడుదలయిన సినిమాలు కొన్ని పోయాయి. మరి కొన్ని ఉన్నాయి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus