హీరోల బ్లాక్‌బస్టర్‌ విలన్‌… ఇప్పుడు హీరోయిన్‌కి విలన్‌!

బాలీవుడ్‌ హీరోయిన్లలో సీనియర్‌ అయిపోయినా ఇప్పటికీ క్యూట్‌గా చిన్న పిల్లలా కనిపించే భామ ఆలియా భట్‌ (Alia Bhatt). సినిమాలో ఎక్స్‌ప్రెషన్స్‌, క్యూట్‌నెస్‌తో కట్టిపడేస్తుంటుంది. ఇక హీరోగా ఎన్న సినిమాలు చేసినా.. విలన్‌గా ఒక్క సినిమా చేసి పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు బాబీ డియోల్‌ (Bobby Deol). ‘యానిమల్‌’ (Animal) అతని క్రూయల్‌ విలనిజం అంత బాగా పండింది మరి. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి ఓ సినిమాలో నటించబోతున్నారు. అలా అని హీరో హీరోయిన్లుగా కాదు. ఆమె ‘హీరో’యిన్‌ అయితే… అతను విలన్‌.

పాత్ర ఏదైనా అలవోకగా నటించి మెప్పించగలిగే హీరోయిన్‌ ఆలియా భట్‌. అలాంటామె ఇప్పుడు యాక్షన్‌ సినిమా చేయడానికి సిద్ధమవుతోంది. యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో వరుసగా వస్తున్న స్పై యూనివర్శ్‌లో కొత్త సినిమా ఆమెదే. ఆమెను స్పైగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో శర్వరీ వాఘ్‌ మరో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్‌ను తీసుకున్నారట. ‘యానిమల్‌’ సినిమాలో చూపించిన విలనిజానికి మెచ్చిన టీమ్‌… ఇప్పుడు ఆలియాకు విలన్‌ను చేస్తున్నారట.

ఈ ఏడాది సెకండాఫ్‌లో ఈ సినిమా షూటింగ్‌ ఉంటుందట. స్పై యూనివర్శ్‌లో సినిమా కాబట్టి ఇందులో ఇతరు స్పైలు అతిథి పాత్రల్లో కనిపిస్తారు అని చెబుతున్నారు. అంటే షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan), సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) , హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) , ఎన్టీఆర్‌లో (Jr NTR) కొంతమంది ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించొచ్చు అని టాక్‌. ఇక బాబీ డియోల్‌ గురించి చూస్తే తెలుగులో వరుసగా సినిమా కథలు వింటున్నాడట. బాలకృష్ణ (Balakrishna) – బాబీ సినిమాలో విలన్‌గా నటించనున్న బాబీ… మరికొన్ని సినిమాలు ఓకే చేసే పనిలో ఉన్నాడట.

ఇక ఆలియా సంగతి చూసుకుంటే… గతేడాది ‘రాకీ ఔర్‌ రాణీకి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani) అనే హిందీ సినిమాతోపాటు, ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ అనే అమెరికన్‌ సినిమా చేసింది. ఇప్పుడు హిందీలో ‘జిగ్రా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె నిర్మాత కూడా కావడం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus