Bobby Simha: సలార్2 సినిమాపై షాకింగ్ అప్ డేట్ ఇచ్చిన బాబీ సింహా.. ఏం చెప్పారంటే?

సలార్1 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ప్రస్తుతం అందరి దృష్టి సలార్2 సినిమాపై ఉంది. సలార్2 సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళుతుందని సలార్1 లో కీలక పాత్రలో నటించిన బాబీ సింహా వెల్లడించారు. సలార్2 సినిమాకు సంబంధించిన సందేహాలకు బాబీ సింహా చెక్ పెట్టారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్2 స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. సలార్2 సినిమా ఏప్రిల్ లో మొదలైతే 2025 సెకండాఫ్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ప్రశాంత్ నీల్ సైతం త్వరలో భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. సలార్2 సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్2 సినిమాలో ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకనున్నాయనే సంగతి తెలిసిందే. సలార్2 సినిమాలో ప్రభాస్ పృథ్వీరాజ్ పాత్రల మధ్య వచ్చే సీన్లు ఆసక్తికరంగా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

సలార్2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సలార్1 సినిమాలో శృతి హాసన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ప్రభాస్, శృతి లవ్ లో ఉన్నట్టు కూడా సీన్స్ లేవు. సలార్2 సినిమాలో ప్రభాస్, శృతి కాంబోలో సీన్స్ ఉంటాయో లేదో చూడాలి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించి తెలివిగా స్క్రీన్ ప్లే రాసుకున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సలార్2 సినిమాకు కూడా సీక్వెల్ ఉండవచ్చని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అటు ప్రభాస్ ఇటు ప్రశాంత్ నీల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల సలార్2 సినిమాకు సంబంధించిన చాలా ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. సలార్ సీక్వెల్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus