ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

గొవిందా.. ఆ రోజుల్లో బాలీవుడ్‌లో ది బెస్ట్‌ డ్యాన్సర్‌. అందరూ డ్యాన్స్‌ చేస్తుంటే కాళ్లు, చేతులు ఆడించినట్లు ఉంటుంది కానీ.. గొవిందా డ్యాన్స్‌ చేస్తుంటే ఏదో స్పెషల్‌గా ఉంటుంది అని అనేవారు. ఇప్పటికీ అదే మాట అంటారు అనుకోండి. ఎందుకంటే ఆయన అంత స్పెషల్‌ మరి. అలాంటి గొవిందా స్టార్‌ హీరో అవ్వడానికి ప్రధానమైన కారణం సౌత్‌ సినిమా. అవును ఆయన మన దగ్గర నటించలేదు కానీ.. ఆయన స్టార్‌ డమ్‌ వెనుక ఉన్న సౌత్‌ సినిమాలే. ఈ విషయాన్ని ఆయనే చాలాసార్లు చెప్పాడు. రీసెంట్‌గా కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Govinda

గొవిందా యాక్టర్‌గా స్ట్రగుల్‌ అవుతున్న సమయమిది. ఇతర హీరోలకు వరుస ఛాన్స్‌లు వస్తున్నాయి.. నాకెందుకు రావడం లేదు అనుకుంటూ ఓసారి దీర్ఘంగా ఆలోచించాడట. ఇక ఇక్కడి వారితో అయ్యేలా లేదు. సీనియర్‌ దర్శకుడు, హిట్‌ డైరక్టర్‌లు స్టార్‌ హీరోల చుట్టూ తిరుగుతున్నారు అని అర్థం చేసుకొని రీమేక్‌లు చేద్దామని ఫిక్స్‌ అయ్యాడట. అలా తనకు దగ్గరైన కొత్త నిర్మాతలు, యువ దర్శకులతో ఓసారి దక్షిణాదికి వచ్చాడు. హైదరాబాద్‌, చెన్నైలో కొన్ని రోజులు ఉండి ఇక్కడి సినిమాలన్నీ చూశారట.

అలా చూసినవాటి నిర్మాతలతో మాట్లాడి సినిమా రీమేక్‌ హక్కులు కొనుక్కున్నారట. ఒకవేళ అమ్మడానికి ఇష్టం చూపించకపోయినా, ఇతర ఆలోచనలతో నో చెప్పిన వారి సినిమాలను కాపీ కొట్టేశారట. ఈ మాట ఊహాగానాలు కాదు. గొవిందానే స్వయంగా చెప్పాడు. అలా చేసిన సినిమాలు మంచి విజయాలు అందుకోవడం, బాలీవుడ్‌కి కొత్తదనం ఇవ్వడంతో స్టార్‌ హీరోగా మారాను అని చెప్పాడు. అయితే వాళ్లెందుకు సినిమా రీమేక్ రైట్స్‌ అమ్మలేదు అనేది తెలియదు.

ఏదైతేనేం మన సినిమాల వల్ల ఓ బాలీవుడ్‌ హీరో అగ్ర హీరోగా మారాడు. అయితే వరుస విజయాలు అందుకుంటున్న సమయంలోనే గొవిందా నెమ్మదించాడు. ఇప్పుడు నిర్మాతగా తనయుడితో సినిమా నిర్మించే పనిలో ఉన్నాడు.

5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus