Akhil: అఖిల్ న్యూ ప్రాజెక్ట్.. RGV కథతో లింకా?

అక్కినేని అఖిల్ (Akhil Akkineni) తన తదుపరి సినిమాను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఆ ప్రాజెక్ట్‌పై ఆసక్తికరమైన సమాచారమొకటి బయటకు వచ్చింది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) హిట్ తర్వాత, ‘ఏజెంట్’ (Agent) సినిమాతో నిరాశపరిచిన అఖిల్, కొత్త ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నాడు. ఈసారి, అతడు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కృష్ణ దర్శకత్వంలో నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను అక్కినేని నాగార్జున (Nagarjuna) స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని తెలుస్తోంది.

Akhil

ఈ చిత్రం పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా, తిరుపతి నేపథ్యంలో తెరకెక్కబోతోందట. కథలో ఫాంటసీ ఎలిమెంట్లు ఉంటాయని, ఇదే చర్చకు ప్రధాన కారణమైంది. అఖిల్ కొత్త సినిమాలో తిరుపతి నేపథ్యంలో సాగే కథ ఉండడంతో, గతంలో నాగార్జున నటించిన ‘గోవింద గోవింద’ సినిమా తరహాలో ఉందా? అన్న సందేహం అందరిలో కలిగింది. ఆ సినిమాకు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ కొత్త ప్రాజెక్ట్ రీమేక్ కాకుండా, పూర్తి కొత్త కథతో రాబోతోందని టాక్ వినిపిస్తోంది. అఖిల్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపించనున్నాడు. యాక్షన్ డిజైన్స్, బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ లుక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చివరి దశలో ఉండగా, అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. అభిమానులు అతడి కొత్త లుక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు UV క్రియేషన్స్ లో కూడా అఖిల్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను అనిల్ అనే కొత్త దర్శకుడు చేయనున్నాడు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో ఆ సినిమా చేయాలని అనుకుంటున్నారు. ఇక పూరి జగన్నాథ్ (Puri Jagannadh) తో కూడా ఇదివరకే ఒక కథపై చర్చలు జరిపినట్లు టాక్. ఆ కాంబినేషన్ విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది. నెక్స్ట్ అఖిల్ నుంచి రాబోయే సినిమాలు మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

పవన్ కోసం మరోసారి రంగంలోకి త్రివిక్రమ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus