Devara: దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ సంతోషించేలా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కృతిసనన్ కనిపిస్తారని తెలుస్తోంది. దేవర సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో పాటు కొన్ని సీన్లలో కృతి మెరుస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

అయితే దేవర మేకర్స్ నుంచి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. దేవర సినిమా భారీ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దేవర సినిమా కోసం ఎన్టీఆర్ రేయింబవళ్లు కష్టపడుతున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ ను ఎలా చూడాలని కోరుకుంటారో ఈ సినిమాలో తారక్ అలానే కనిపించనున్నారని సమాచారం. దేవర సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం.

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలోని కొన్ని మేజర్ యాక్షన్ సీక్వెన్స్ లను సముద్రం బ్యాక్ డ్రాప్ లో షూట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో కొరటాల శివ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు. దేవర మూవీ సక్సెస్ సాధిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావచ్చని జాన్వీ కపూర్ భావిస్తున్నారు.

హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ఖరీదైన ఫ్లాట్ ను కొనుగోలు చేస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర సినిమాతో ఈ సినిమా నిర్మాతలకు కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. 2024 సమ్మర్ లో దేవర సినిమా సంచలనం సృష్టిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus