ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్న బాలీవుడ్ బ్యూటీ

మహానటుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ రామకృష్ణ సినీ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభమైంది. దాన వీర సూర కర్ణ సినిమాలోని కీలకమైన సీన్ ని తెరకెక్కించారు. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం చిత్ర బృందం ఎన్టీఆర్ స్వస్ధలం నిమ్మకూరుకి వెళ్లనున్నారు. అక్కడ ఎన్టీఆర్ యవ్వనంలో జరిగిన సంఘటనలను తీయనున్నారు. ఓ వైపు షూటింగ్ షెడ్యూల్ విషయంలో బిజీగా ఉన్నప్పటికీ ఆర్టిస్టుల సెలక్షన్ జరుగుతోంది. ఎన్టీఆర్ సినీ లైఫ్ లో శ్రీదేవితో కలిసి సూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకే ఈ సినిమాలో శ్రీదేవి రోల్ కూడా ఉంది.

ఆ రోల్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే ని చిత్ర బృందం సంప్రదించింది. ఆమె నటించడానికి ఉత్సాహంగా ఉంది. త్వరలోనే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం విద్య బాలన్ ని అడిగారు. అలాగే కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్ కనిపించనున్నారు. ఎన్‌బీకే ఫిలింస్‌ బ్యానర్‌పై బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణువర్థన్‌ ఇందూరిలు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంతోష్‌ తుండియిల్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్న సినిమాలో ఇందిరాగాంధీ రోల్ ని నదియా పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్న ఈ సినిమా దసరాకు థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus