మనం ఎన్నో అద్భుత చిత్రాలను తీసినప్పటికి టాలీవుడ్ అంటే హాలీవుడ్ వారికే కాదు బాలీవుడ్, కోలీవుడ్ వారికీ చులకనే. నార్త్ ఇండియా వారికి సౌత్ ఇండియన్ ఫిల్మ్ అంటే తమిళ చిత్రమనే గుర్తింపు ఉంది. ఆ అపోహాలను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకే ఒక్క సినిమాతో పటాపంచలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా తెరకెక్కించిన బాహుబలి చరిత్ర సృష్టించింది. జాతీయ అవార్డు దక్కించుకుని ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమల వారి చూపు టాలీవుడ్ పై పడేలా చేసింది. బాలీవుడ్ లో డైరక్ట్ హిందీ చిత్రానికి సమానంగా వసూళ్లను రాబట్టి తెలుగువాడి ప్రతిభను నిరూపించింది. అంతేకాదు ఈ మూవీకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ కి ఉన్న క్రేజ్ చూసి కొంతమంది బాలీవుడ్ దర్శకులు జీర్ణించుకులేక పోతున్నారు.
జక్కన్న తో సినిమా తీయాలని ఆశపడుతున్న నిర్మాతలను వారు పనికట్టుకొని అడ్డుపడుతున్నారు. రాజమౌళి స్థాయి టాలీవుడ్ మాత్రమే, అతని బాలీవుడ్ చిత్రం తీసే స్థాయి లేదని ప్రచారం చేస్తున్నారంట. ఈ విషయం దర్శకధీరుడు చెవిన పడేసరికి ఆవేశం ఆపుకోలేకపోయారు. బాలీవుడ్ లో కొంతమంది చెత్త దర్శకులు ఉన్నారని చెప్పారంట. ఈ మాటలకు వారు మరింత కోపం తెచ్చుకుని జక్కన్న బాలీవుడ్ లో అడుగుపెట్టకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకధీరుడిని ఎవరూ ఆపలేరన్న సంగతి ఆ అజ్ఞానులకు ఆయన సినిమాలే సమాధానం చెబుతాయని తెలుగు సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.