Jr NTR: ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ డైరెక్టర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా మాత్రమే కాకుండా నేడు పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అనిల్ శర్మ ఒకరు

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Jr NTR) ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనిల్ శర్మ దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్స్‌, ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈయన దర్శకత్వంలో వచ్చినటువంటి గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ 2001లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం అందుకుంది.

ఇందులో సన్నీ దేఓల్‌ తారాసింగ్‌ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు ఇలా ఈ సినిమా విడుదలైనటువంటి 22 సంవత్సరాలకు ఈ సినిమా సీక్వెల్ చిత్రంగా గదర్‌ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా విడుదలైనటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ అనిల్ శర్మకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

మీరు దర్శకత్వం వహించినటువంటి గధర్ సినిమాలో తారా సింగ్ పాత్ర నేటితరం హీరోలతో చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ఆ పాత్రలో నటించే హీరోలు బాలీవుడ్ ఇండస్ట్రీలో లేరని ఆయన తెలిపారు. ఇక తారా సింగ్ పాత్రకు 100% నాయం చేయగలిగే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ మాత్రమే అంటూ ఈయన ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించడంతో ఆయన అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus