ప్రభాస్ సినిమాలో ‘కత్తి’ లాంటి విలన్..!
- November 20, 2016 / 05:02 AM ISTByFilmy Focus
బాహుబలి ప్రభాస్ ఆరడుగుల ఆజానుబావుడు. తెరపై అతడి హీరోయిజం పండిస్తుంటే అభిమానుల నరాలు బిగుసుకుంటాయి. క్లాస్, మాస్ అనే తారతమ్యాలేవీ ఈ డార్లింగ్ హీరోకి అస్సలు పట్టవు. అందుకే ‘బుజ్జిగాడు’గా నవ్విస్తూనే ‘మిర్చి’ మసాలా సినిమాలు చేస్తూ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనిపించేకున్నాడు. అయితే తెరపై హీరోయిజం బాగా పండాలంటే ప్రతినాయకుడు కూడా అదేస్థాయిలో మెప్పించగలగాలి. ఆ ఇద్దరి మధ్య ఢీ అంటే ఢీ అన్నట్టు పోరు ఉంటేనే థియేటర్లు చప్పట్లతో, ఈలలతో హోరెత్తిపోతాయి.
ప్రస్తుతం ‘బాహుబలి2’ పనులను ముగించే పనుల్లో ఉన్న ప్రభాస్ తర్వాత సుజిత్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ప్రభాస్ ఇచ్చిన గ్యాప్ ని బాగా వాడుకున్న సుజీత్ కథకి మరిన్ని మెరుగులు దిద్ది స్క్రిప్ట్ ని మరోస్థాయికి తీసుకెళ్లాడు. దానికి సరిపడా నటీనటులను కూడా వెతికి పట్టిన ఈ యువ దర్శకుడు ప్రభాస్ కోసం ధీటైన నటుడిని తీసుకొచ్చాడు. పలు బాలీవుడ్ సినిమాలతో మెప్పించి తమిళ సినిమా ‘కత్తి’తో దక్షిణాదికి ఎంట్రీ ఇచ్చిన నీల్ నితిన్ ముకేశ్ ప్రభాస్ తో తలపడనున్నాడు. ద్విభాషా చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా కోసం ఈ నటుడు తెలుగు, తమిళం నేర్చుకునే పనుల్లో తలమునకలై ఉన్నాడు. మరి వీరిద్దరి పోరాటం ఎలా ఉంటుందో తెలియాలంటే వచ్చే ఏడాది ద్వితీయార్థం వరకూ ఎదురు చూడాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















