Katrina Kaif: ఆశలన్నీ కత్రినాపైనే!

కొన్నాళ్లుగా బాలీవుడ్ నుంచి వస్తోన్న సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘డాక్టర్ జి’ సినిమా రెండు వారాల క్రితం విడుదలైంది.. దానికి హిట్ టాక్ వచ్చింది. కానీ సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. దీపావళికి వచ్చే సినిమాలైనా వర్కవుట్ అవుతాయేమోనని అనుకున్నారు. అవి కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ సినిమా కంటెంట్ పరంగా ఆకట్టుకున్నా..

సినిమాకి నెగెటివ్ రివ్యూలే వచ్చాయి. దాంతో భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ అనే సినిమాతో వచ్చారు. ఇది తమిళ సినిమాకు అనఫీషియల్ రీమేక్. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ కూడా నటించారు. కానీ ఈ సినిమా కూడా వర్కవుట్ అవ్వలేదు. ఈ రెండు సినిమాలు కూడా బాలీవుడ్ ఆశల మీద నీళ్లు చల్లేశాయి. వచ్చే వారం మరికొన్ని బాలీవుడ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

మెయిన్ గా కత్రినా కైఫ్ ‘ఫోన్ బూత్’ సినిమాతో రంగంలోకి దిగుతోంది. తనకంటే పదేళ్లు చిన్నవాళ్లైనా ఇషాన్ కట్టర్, సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి ఈ సినిమాలో నటించింది కత్రినా. కథ ప్రకారం ఆమె దెయ్యం పాత్రలో కనిపించనుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ నెటిజన్లను ఆకట్టుకుంది. టీమ్ కూడా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తోంది. పైగా సినిమాలో పాటలన్నీ జనాలకు కనెక్ట్ అవుతున్నాయి. ఈ విషయాలన్నీ సినిమాకి కలిసొచ్చేలా ఉంది.

మొన్నామధ్య కార్తిక్ ఆర్యన్ దెయ్యం కాన్సెప్ట్ తో నటించిన ‘భూల్ బులయ్యా’ సినిమా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కత్రినా కూడా ఆల్టని ఫీట్ అందుకుంటే.. బాలీవుడ్ లో సూపర్ స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయం. కత్రినాకి ఫేమ్ ఉంది కానీ సోలో బాక్సాఫీస్ హిట్స్ మాత్రం పడడం లేదు. మరి ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus