రీమేక్స్‌తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాలనుకుంటున్న బాలీవుడ్..!

సొంతగా తయారు చేసుకున్న కథలు వర్కౌట్ కావట్లేదు.. స్టార్ హీరో, హీరోయిన్లను పెట్టి, భారీ బడ్జెట్‌తో తీసిన పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో బొక్క బోర్లా పడుతున్నాయి.. రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలు తీస్తున్నారని నార్త్ ప్రేక్షకులు సైతం పెదవి విరచారు. మరోవైపు సౌత్ మూవీస్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్స్ వసూలు చెయ్యడంతో.. అక్కడి మేకర్స్ ఖంగుతిన్నారు. దాదాపు రెండేళ్ల పాటు సరైన సినిమా పడక హిందీ ఇండస్ట్రీ కిందా మీదా పడిపోయింది.. ‘బాహుబలి’ సిరీస్‌తో తెలుగు సినిమా సత్తా చూపించి.. ‘కె.జి.యఫ్’ సిరీస్, ‘పుష్ప – ది రైజ్’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాలు రూ. 100 కోట్లు కలెక్ట్ చేయడం వాళ్లకి మింగుడు పడలేదు.. చిన్న సినిమా ‘కార్తికేయ 2’ కూడా అక్కడ సత్తా చాటడంతో షాక్ అయ్యారు. గతేడాది చివర్లో ‘దృశ్యం 2’ కాస్త పరువు కాపాడింది.

కట్ చేస్తే.. 2023 జనవరి బాలీవుడ్ మేకర్స్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. కొంత కాలంగా సాలిడ్ కమ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో పాటు తమ పరిశ్రమకు భరోసానిచ్చాడు. సౌత్ అంటే ఒకప్పుడు చిన్న చూపు చూసిన హిందీ బాబులు ఇప్పుడు సౌత్ స్టామినా తెలిసి మౌనంగా ఉండిపోయారు. సినిమా ఇండస్ట్రీలో రీమేక్స్ అనేవి కామనే.. ఇప్పుడు కొన్ని క్రేజీ సౌత్ మూవీస్ బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి.. వాటి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

అల.. వైకుంఠపురములో – షెహ్జాదా..

అల్లు అర్జున్ – పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ‘అల.. వైకుంఠపురములో’.. కార్తీక్ ఆర్యన్ – కృతి సనన్ హీరో హీరోయిన్లుగా.. రోహిత్ ధావన్ దర్శకత్వంలో ‘షెహ్జాదా’ పేరుతో రీమేక్ అవుతోంది.

ఖైదీ – భోళా..

కార్తి, లోకేష్ కనకరాజ్ కాంబోలో వచ్చిన ‘ఖైదీ’ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఆయనే హీరో, దర్శక నిర్మాత.. ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోస్ అక్కడ కూడా సూపర్ హిట్ గ్యారంటీ అనిపించేలా ఉన్నాయి.

డ్రైవింగ్ లైసెన్స్ – సెల్ఫీ..

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’.. హిందీలో ‘సెల్ఫీ’ పేరుతో రూపొందుతుంది. పృథ్వీ రాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌లో అక్షయ్ కుమార్, సూరజ్ వెంజరమూడు పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నారు..

తడమ్ – గుమ్రా..

తమిళంలో హిట్ అయిన ‘తడమ్’ మూవీని తెలుగులో రామ్ పోతినేని హీరోగా ‘రెడ్’ గా రీమేక్ చేశారు. ఇప్పుడు హిందీలో ఆదిత్య రాయ్ కపూర్ – మృణాళిని ఠాకూర్ నటిస్తున్నారు.

వీరం – కిసీ కా భాయ్ కిసీ కి జాన్..

తమిళనాట సూపర్ హిట్ అయిన అయిన ‘తల’ అజిత్ ‘వీరం’ తెలుగులో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ గా రీమేక్ చేశారు. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. జగపతి బాబు విలన్ కాగా.. వెంకటేష్, రానా, రామ్ చరణ్ అతిథి పాత్రల్లో మెరవనున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus