RRR Release Date: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందా..?

  • September 28, 2021 / 08:32 PM IST

రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 13న సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఆ తరువాత ప్రస్తుతం పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

దీంతో వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా హిందీ రైట్స్ దక్కించుకున్న పెన్ మూవీస్ సంస్థ జనవరి 12న సినిమా విడుదల ఉంటుందని ఎగ్జిబిటర్లకు హింట్స్ ఇస్తున్నారట. ఆ విధంగా సినిమా రిలీజ్ డేట్ సంగతి బయటకొచ్చింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తే ఇండస్ట్రీ వర్గాల్లో రచ్చ జరిగే ఛాన్స్ ఉంది.

ఎందులకంటే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దసరాకు వస్తుందని చెప్పిన తరువాత పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా సంక్రాంతి బరిలోనే రిలీజ్ కానుంది. ఇప్పుడు మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసుకొని సంక్రాంతి వస్తే గనుక.. మిగిలిన సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ మారితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం పక్కా. మరి ఈ విషయంలో పవన్, మహేష్ బాబు వెనక్కి తగ్గుతారేమో చూడాలి!

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus