Salaar: ప్రభాస్ సినిమాలో లేడి విలన్

  • July 10, 2021 / 12:11 PM IST

సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ముద్దుగుమ్మల హవా మళ్ళీ మొదలైంది. చాలా కాలం తరువాత బాషాభేదం లేకుండా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి స్టార్ తో ఛాన్స్ వస్తే ఏ బ్యూటీ కూడా అంత ఈజీగా వధలుకోవడం లేదు. ఇక వాణి కపూర్ కూడా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో శృతి హాసన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆమె నేషనల్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వస్తోంది. అలాగే వాణి కపూర్ పాత్ర కూడా సినిమాలో డిఫరెంట్ గా ఉంటుందట. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమె ఒక లేడి విలన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉంటాయట. మెయిన్ విలన్ వైఫ్ పాత్ర కోసం ఎవరైనా హాట్ బ్యూటీ అయితే బెటర్ గా ఉంటుందని ఆలోచించన దర్శకుడు చాలామందిని సెర్చ్ చేసి ఫైనల్ గా వాణి కపూర్ ను ఫిక్స్ చేశారట.

గతంలో వార్ లాంటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న వాణి కపూర్ మంచి పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆమెకు కాస్త విభిన్నమైన ఆఫర్ దొరికింది. మరి ఆ సినిమాతో అమ్మడు ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus