ప్రభాస్ ని రిజెక్ట్ చేసిన హీరోయిన్!

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు తెలుగు అమ్మాయిలకే కలల రాకుమారుడు అయిన డార్లింగ్ ఈ సినిమాతో  భారత్ దేశంలోని అందరికీ అభిమాన హీరో అయ్యారు. బాలీవుడ్ బ్యూటీస్ సైతం ప్రభాస్ తో కలిసి ఒక సినిమా చేస్తే చాలు అనుకున్నారు. అందుకే యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సాహో మూవీలో నటించడానికి చాలా మంది ప్రయత్నించారు. కానీ చివరికీ ఆ అవకాశం  శ్రద్ధ కపూర్ కి వరించింది. ఆమె మొదటి షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం దుబాయ్ లోని అద్భుత కట్టల మధ్య సాగుతోంది. నీల్ నితిన్ ముఖేష్, ప్రభాస్ లపై భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ వచ్చింది. ఇందులో  ప్రభాస్ కి  జోడీగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా బట్ ని సంప్రదించారంట.

ఆమె నటించనని చెప్పిందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. కారణం కూడా వెల్లడించాయి. సాహో లో తన పాత్ర కు లెన్త్ తక్కువ ఉందని డార్లింగ్ సినిమాని రిజెక్ట్ చేసిందని సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత .. ఎందుకు ఈ సినిమాని వదులుకున్నానా? అని ఆలియా తప్పకుండా బాధపడుతుందని చిత్ర బృందం చెప్పింది. ఎందుకంటే అత్యంత భారీ బడ్జెట్ తో హాలీవుడ్, బాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్న ఈ సినిమా సంచలనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేసింది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ లు నిర్మిస్తున్న సాహో వేసవిలో సందడి చేయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus