Jai Hanuman: జై హనుమాన్ విషయంలో ప్రశాంత్ లెక్కలివేనా.. అలా చేయబోతున్నారా?

హనుమాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో జై హనుమాన్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం జై హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా బాలీవుడ్ స్టార్ హీరో నటించనున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. హనుమాన్ రోల్ లో బాలీవుడ్ హీరో ఫిక్స్ కావడం బాలీవుడ్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగించింది.

మరోవైపు రాముడిగా టాలీవుడ్ హీరో కనిపించనున్నారని ఆరుగురు టాలీవుడ్ స్టార్స్ లో ఒకరిని ఆ పాత్ర కోసం పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా ఆ రోల్ లో ఎవరు చేసినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జై హనుమాన్ (Jai Hanuman) మూవీకి బడ్జెట్ విషయంలో కూడా సమస్య లేదు.

ఎంత బడ్జెట్ తో తెరకెక్కినా స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమాకు అంచనాలను మించి బిజినెస్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. చాలామంది నిర్మాతలు ప్రశాంత్ తో సినిమాలు చేయాలని ఆశ పడుతుండగా ప్రశాంత్ ఎవరికైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ భవిష్యత్తులో భారీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ వర్మ భవిష్యత్తు సినిమాలు సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రశాంత్ వర్మకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు సినిమాలకు ఈ దర్శకుడు ఎలాంటి కాన్సెప్ట్ లను ఎంచుకుంటారో తెలియాల్సి ఉంది. హనుమాన్ మూవీ రిజల్ట్ తో ఈ తరహా కాన్సెప్ట్ సినిమాలను టాలీవుడ్ దర్శకులు అద్భుతంగా హ్యాండిల్ చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. హనుమాన్ మూవీ ఈ వీకెండ్ లో కూడా బుకింగ్స్ విషయంలో అదరగొడుతోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus