బాక్సాఫీస్ వద్ద గెలుపోటములు అనేది సర్వసాధారణం కానీ.. బాలీవుడ్ లో ఈ ఏడాది ఒకరిద్దరు కాదు ఏకంగా ముగ్గురు టాప్ హీరోలు దారుణమైన ఫ్లాప్స్ కొట్టి అభిమానులను నిరాశపరచడమే కాక బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడి నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. ఏడాది మొదట్లో సల్మాన్ ఖాన్ “రేస్ 3” అంటూ వచ్చి పెద్ద డిజాస్టర్ ఇవ్వగా.. ఆ తర్వాత అమీర్ ఖాన్ “థగ్స్ ఆఫ్ హిందుస్తాన్” సినిమాతో 2018లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు.
తాజాగా ఈ లిస్ట్ లోకి షారుక్ ఖాన్ కూడా వచ్చి చేరాడు. నిన్న విడుదలైన “జీరో” యునానిమస్ డిజాస్టర్ గా డిక్లేర్ చేయబడింది. ఇలా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోలైనఈ ముగ్గురు ఖాన్ లు ఇలా బోల్తాకొట్టడంతో బాలీవుడ్ కి ఈ ఏడాది సక్సెస్ రేట్ కనీసం సింగిల్ డిజిట్ లో కూడా కనిపించడం లేదు. ఇకనైనా ఈ బాలీవుడ్ స్టార్లు కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు కంటెంట్ కు కూడా ప్రాధాన్యత ఇస్తారని ఆశిద్దాం. ఈ ఏడాది నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా మన సౌత్ సినిమాలదే హవా కావడం గమనార్హం.