తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఎంతలా అంటే అన్ని భాషల సినిమాలను డామినేట్ చేసేంతలా. రాజమౌళి ‘బాహుబలి’ (Baahubali) తో తెలుగు సినిమా రేంజ్ ను అమాంతం పెంచేశాడు. ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తో మరోసారి అక్కడ తన సత్తా చాటాడు. ఇక రాజమౌళి సినిమా వచ్చేలోపు సుకుమార్ కూడా తెలుగు సినిమా రేంజ్ ఏంటో ‘పుష్ప’ తో ప్రూవ్ చేసే పని పెట్టుకున్నాడు. మొదటి భాగం అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో భాగం కూడా అక్కడ అద్భుతాలు సృష్టిస్తుంది.
సౌత్ నుండి ప్రశాంత్ నీల్ కూడా అక్కడ భారీ మార్కెట్ పొందాడు. అతని సినిమాలు కూడా అక్కడ భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగా సంగతి చెప్పనవసరం లేదు. అక్కడ అతను పాగా వేసి చాలా కాలం అయ్యింది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేసి.. నార్త్ లో (Bollywood) మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన సినిమాలు ఏంటో.. ‘పుష్ప 2’ అక్కడ ఏ ప్లేస్లో నిలిచిందో ఓ లుక్కేద్దాం రండి :
1) పుష్ప 2 :
సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రూపొందిన ‘పుష్ప’ (Pushpa) నార్త్ లో సూపర్ హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.ప్రీమియర్ షోలతో కూడా కలుపుకుని మొదటి రోజు ‘పుష్ప 2’ చిత్రం రూ.65.7 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను రాబట్టింది.
2) జవాన్ :
షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘జవాన్’ (Jawan) . ఈ సినిమా మొదటి రోజు రూ.63.6 కోట్లు నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) దెబ్బకి సెకండ్ ప్లేస్ కి వెళ్ళిపోయింది.
3) పఠాన్ :
షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా రూ.54 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.
4) కె.జి.ఎఫ్ 2 (KGF 2) :
ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో యష్ (Yash) హీరోగా రూపొందిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ మూవీ తొలి రోజు నార్త్ లో రూ.53.95 నెట్ బాక్సాఫీస్ కలెక్షన్లను రాబట్టి.. భారీ ఓపెనింగ్స్ సాధించిన సౌత్ సినిమాగా అక్కడ రికార్డులు క్రియేట్ చేసింది.
5) స్త్రీ 2 (Stree2) :
శ్రద్దా కపూర్ (Shraddha Kapoor) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ హర్రర్ కామెడీ సినిమా అక్కడ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ.52.1 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టి రికార్డులు కొట్టింది. ప్రీమియర్ షోలతో కూడా కలుపుకుంటే రూ.59 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది.
6) వార్ (War) :
హృతిక్ రోషన్ (Hrithik Roshan) & టైగర్ ష్రాఫ్ ల (Tiger Shroff) కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.51.6 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది.
7) యానిమల్ (Animal) :
రణబీర్ కపూర్ (Ranbir Kapoor), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద రూ.50.95 కోట్ల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని రాబట్టింది.
8) థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ (Thugs of Hindostan) :
ఆమిర్ ఖాన్ (Aamir Khan) – అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కాంబినేషన్లో వచ్చిన ఈ హిస్టారికల్ మూవీ మొదటి రోజు రూ.50.75 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
9) హ్యాపీ న్యూ ఇయర్ (Happy New Year) :
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.42.62 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
10) భారత్ :
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.42.30 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.
11) బాహుబలి2 (Baahubali 2) :
రాజమౌళి (S. S. Rajamouli) – ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ మొదటి రోజు రూ.41 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది.