ఇకపై హిందీ సినిమాల్లో పాకిస్తాన్ ఆర్టిస్టులుండరు

ఇదివరకు కూడా పాకిస్తాన్ నటులకు బాలీవుడ్ లో నిషేదం ప్రకటించాలని ప్రస్తావన వచ్చినప్పటికీ.. అప్పటికి షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమాలో హీరోయిన్ పాకిస్తానీ అవ్వడంతో అప్పటికి ఆమెను కేవలం ప్రచార కార్యక్రమాల నుంచి తప్పించి సినిమాను మాత్రం విడుదల చేశారు. కానీ.. మొన్న జరిగిన పుల్వామా బాంబ్ బ్లాస్ట్ కారణం చేత పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం మండిపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ కూడా తమదైన శైలిలో పాకిస్తాన్ పై కక్ష సాధింపు చర్య మొదలెట్టింది.

అందులో భాగంగా బాలీవుడ్ నుంచి పాకిస్తాన్ ఆర్టిస్టులను కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఈ మేరకు నిన్న అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు. దాంతో బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ కోట్లు గడిస్తున్న పాకిస్తాన్ యాక్టర్లు అందరూ భయపడడం మొదలెట్టారు. ఇక అజయ్ దేవగన్ అయితే ఒకడుగు ముందుకేసి ఏకంగా తన తాజా చిత్రమైన “టోటల్ ధమాల్”ను పాకిస్తాన్ లో విడుదల చేయడం లేదంటూ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ పద్ధతిని ఇప్పుడు మరింతమంది బాలీవుడ్ దర్శకనిర్మాతలు మరియు హీరోలూ ఫాలో అయ్యే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus