ఎన్టీఆర్, మహేష్ మధ్య స్నేహానికి మరో నిదర్శనమే ఇది

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ మధ్య మంచి స్నేహం ఉందని భరత్ అనే నేను సినిమా సమయంలో అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అనేక వేడుకల్లో పాల్గొని అభిమానుల మధ్య దూరాన్ని కూడా తగ్గించారు. తాజాగా వారిద్దరూ ఎంత మంచి స్నేహితులో చెప్పడానికి ఓ సంఘటన జరిగింది. ఎన్టీఆర్ ప్రతుస్తం త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత వీరరాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 10 న థియేటర్లోకి రానుంది. రిలీజ్ కి పెద్ద దూరం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయింది. టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పోనీ ఎప్పుడు వస్తుందోనైనా చెబితే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ మొన్నటి వరకు ఆ విషయాన్ని చెప్పలేదు.

అందుకు కారణం మహేష్ అని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఆ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ ని మహేష్ పుట్టినరోజు (9 తేదీన ) రిలీజ్ చేశారు. ఆ లుక్, టీజర్ ట్రెండ్ కావాలంటే తన మూవీ ఆప్టెడ్ ముందు చెప్పకూడదని ఎన్టీఆర్ చిత్ర బృందానికి చెప్పారంటా. అందుకే ఆరోజు సాయంత్రం వరకు ఆగి అరవింద సమేత టీజర్ ఈ నెల 15న విడుదల చేస్తామని వెల్లడించారు. దీంతో మహేష్, ఎన్టీఆర్ మధ్య ఎంత స్నేహం ఉందో మరోసారి తెలిసింది. స్టార్ హీరోల మధ్య ఆ మాత్రం అండర్ స్టాండింగ్ ఉంటే పరిశ్రమకి చాలామంచిదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus