Srimanthudu: పదేళ్ల వయసులోనే స్కూల్ దత్తత తీసుకున్న విద్యార్థి!

  • November 23, 2023 / 09:36 AM IST

సినిమాల ప్రభావం జనాలపై ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి ఎంతోమంది హీరోల వేషధారణ వారి అలవాట్లను అనుసరిస్తూ ఉంటారు. అయితే కొన్ని సినిమాలలో హీరోలు నటించడంతో వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఎంతోమంది సమాజ సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు అనడానికి ఈ ఖమ్మం కుర్రాడే నిదర్శనం అని చెప్పాలి. పట్టుమని పదేళ్ల వయసులోనే మహేష్ బాబు సినిమాని చూసి స్ఫూర్తి పొంది ఏకంగా తన గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ పాఠశాలలో దత్తత తీసుకున్నారు.

రఘునందన్ అనే బాలుడు 10 సంవత్సరాల వయసులోనే మహేష్ బాబు నటించిన (Srimanthudu) శ్రీమంతుడు సినిమా చూసి తాను కూడా ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో తన తండ్రి మద్దతుతో తన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను దత్తత తీసుకొని ఆ పాఠశాలను అభివృద్ధి చేశారు. తన హుండీలో ఉన్నటువంటి డబ్బు అలాగే తన తండ్రి వద్ద కొంతమేర డబ్బు తీసుకొని మొట్టమొదట పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటామని చెప్పారు.

ప్రతి ఏడాది తన పుట్టినరోజుకు పాఠశాలలలో బెంచెస్ వాటర్ బుక్స్ లేనటువంటి వారికి నోట్ బుక్స్ బ్యాక్ చెప్పులు వంటి వాటిని సహాయం చేస్తున్నానని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రఘునందన్ తెలిపారు. ఇలా ఈ పాఠశాలను ప్రతి ఏడాది ఎంతో అభివృద్ధి చేసి మరెందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇక జిల్లాలోని ఉత్తమ స్వచ్ఛ పాఠశాలగా ఈ స్కూలు అవార్డులు అందుకుంది. జాతీయ అవార్డు కూడా దక్కిందట.

10 సంవత్సరాల వయసులో ఎంతో ఉన్నతంగా ఆలోచించి రఘునందన్ ఒక పాఠశాలను అభివృద్ధి చేసి మరెందరికో స్పూర్తిగా నిలిచారు అయితే ఈయన మాత్రం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి పరిచే సన్నివేశాన్ని చూసే తాను కూడా స్ఫూర్తి పొందాలని తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది రఘునందన్ గొప్ప ఆలోచన పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus