బెల్లంకొండ శ్రీనువాస్ లుక్ పై బోయపాటి మాస్ మార్క్

మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. కథలో కుదిరినన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేయడంతోపాటు.. తన సినిమాలో నటించే హీరో లేదా విలన్ కు అంతకుముందు వరకూ వారు కనిపించిన తీరుకు భిన్నమైన మేకోవర్ ఇచ్చి, మరింత పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో సిద్ధహస్తుడు బోయపాటి. “భద్ర” మొదలుకొని “లెజండ్” వరకూ తాను తెరకెక్కించిన ప్రతి సినిమాలోని కథానాయకుడి పాత్రతోపాటు వారి ఆహార్యాన్ని బోయపాటి తీర్చిదిద్దిన విధానమే అందుకు నిదర్శనం. ఆయన మునుపటి సినిమా “సరైనోడు”లోనూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా పిక్చరైజ్ చేసిన విధానానికి ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. అలాగే.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రంలోనూ తనదైన మార్క్ చూపనున్నాడు బోయపాటి. ఇప్పటివరకూ క్లాస్ హీరోగా ఉన్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు సరికొత్త మోకోవర్ ఇచ్చాడు బోయపాటి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ ను రేపు (జనవరి 3) బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. “మా ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న రెండో చిత్రమిది. హైద్రాబాద్, వైజాగ్ లలో జరిగిన షెడ్యూల్ లో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, హీరోయిన్లు రకుల్ ప్రీత్-ప్రగ్యాజైస్వాల్, జగపతిబాబు, శరత్ కుమార్, ధాన్యబాలకృష్ణ లు పాల్గొనగా బోయపాటి శ్రీను ఇప్పటికే 20% చిత్రీకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో 2.5 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మింపబడిన భారీ సెట్ లో కథానాయకి రకుల్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లపై ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో ఫస్ట్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్ ను బోయపాటి డిజైన్ చేసిన విధానం, అతడి క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసిన తీరు శ్రీనివాస్ ను మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోగా మార్చడం ఖాయం. ఫీల్ గుడ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతొంది” అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus