Boyapati Srinu: బాలయ్య అభిమానులకు అఖండ సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన బోయపాటి!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా అంటే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చి బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేశాయి. యాక్షన్ సీక్వెన్స్ సినిమాలకు బోయపాటి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇక బాలయ్యతో ఈయన చేసే సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నాయో మనకు తెలిసిందే. ఇలా బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో చివరిగా వచ్చినటువంటి చిత్రం అఖండ.

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. ఇలా అఖండ సినిమా బాలయ్యకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందని గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై బోయపాటి స్పందించారు. తాజాగా బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమా వచ్చేనెల విడుదల కానున్నటువంటి నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇకపోతే బోయపాటి (Boyapati Srinu )కూడా ఈ కార్యక్రమంలో ఆఖండ సీక్వెల్ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ ప్రస్తుతం స్కంద సినిమా పనులలో బిజీగా ఉన్నామని ఈ సినిమా పూర్తి కాగానే బాలయ్య అఖండ 2 షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్లానింగ్ జరుగుతున్నాయని

అతి త్వరలోనే ఈ విషయాలన్నింటిని కూడా అధికారకంగా తెలియజేస్తాము అంటూ బోయపాటి తెలియజేశారు. ఇలా ఈయన చేసిన కామెంట్స్ విన్నటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈయన మాటలు బట్టి చూస్తుంటే ఈ సినిమా సీక్వెల్ చిత్రానికి కూడా ఈ ఏడాదిలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus