Boyapati Srinu: పవన్ తో సినిమాలు చేయకపోవడానికి అదే కారణం!

  • October 21, 2023 / 08:34 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి వారిలో బోయపాటి శ్రీను ఒకరు. బోయపాటి దర్శకత్వంలో ఇప్పటివరకు పలువురు హీరోలు సినిమాలు చేసి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక బోయపాటి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా హై వోల్టేజ్ మాస్ యాక్షన్ సన్నివేశాలతో తెరకేక్కి ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈయన రామ్ హీరోగా నటించిన స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఇప్పటివరకు బోయపాటి శ్రీను పవన్ కళ్యాణ్ హీరోగా ఒక్క సినిమా కూడా చేయలేదు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాకపోవడానికి గల కారణం ఏంటి అన్న సందేహాలు కూడా అందరిలోనూ తలెత్తుతూ ఉంటాయి. అయితే బోయపాటి శీను దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించకపోవడానికి కారణం ఏంటి అనే విషయాలను తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి (Boyapati Srinu) బోయపాటి శ్రీను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌కి ఫిల్టర్ లేదని.. ఏది అనుకుంటే అది చేసేస్తారని వ్యాఖ్యానించారు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ, ఎక్కడ నిజాయితీ, న్యాయం ఉంటే అక్కడ ఆయన నిలబడతారని పవన్‌కి హ్యాట్సాఫ్ అని తెలిపారు.

ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయకపోవడం గురించి కూడా ఈయన మాట్లాడుతూ…తను హైజానర్‌లో సినిమా తీయాలని అనుకుంటానని అందువల్లే పవన్ ముందుకు రారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉండటం వల్ల అన్ని రోజులు ఆయన ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని.. ఒకవేళ ఇస్తే తప్పకుండా భవిష్యత్తులో పవన్‌తో సినిమా తీస్తానని స్పష్టం చేసారు. బోయపాటి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus