టాలీవుడ్ స్టార్ హీరో రామ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్కంద సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా భారీ బడ్జెట్ తో భారీ లెవెల్ లో ఈ సినిమాను నిర్మించడంతో ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా ఆకట్టుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
అయితే స్కంద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని బోయపాటి శ్రీను ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే అఖండ2 సినిమా దిశగా బోయపాటి శ్రీను అడుగులు వేస్తున్నారు. బోయపాటి శ్రీను తన హిట్ సినిమాలకు సీక్వెల్స్ తీయడంపై దృష్టి పెట్టారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సరైనోడు సీక్వెల్ గురించి కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
బోయపాటి శ్రీను ఇతర డైరెక్టర్లను సీక్వెల్స్ విషయంలో ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. బోయపాటి శ్రీను పారితోషికం ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. స్కంద మూవీ విడుదలైన తర్వాత బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య బోయపాటి కాంబో మూవీ పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్కంద మూవీకి పోటీగా పలు సినిమాలు విడుదలవుతుండగా లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా వాడుకోనుంది. సలార్ మూవీ రిలీజ్ డేట్ మారడంతో ఈ నెల చివరి వారంలో ఎక్కువ సినిమాలు పోటీ పడుతున్నాయి. స్కంద, చంద్రముఖి2, పెదకాపు1 సినిమాలలో ఏ సినిమాకు అనుకూలంగా ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. ఈ మూడు సినిమాల బడ్జెట్ 150 కోట్ల రూపాయల కంటే ఎక్కువని సమాచారం. రామ్ రాబోయే రోజుల్లో తన సినిమాలతో రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.