యాక్షన్ సీన్ల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను నందమూరి నాయకులతోనే కాకుండా మెగా హీరోలతోను హిట్ కొట్టగలడని “సరైనోడు” చిత్రం ద్వారా నిరూపించుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ డైరక్టర్ కి చిరంజీవి 151వ సినిమాను డైరక్ట్ చేసే అవకాశం లభించిందని తాజా సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ తన 150 చిత్రం ఖైదీ 150 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సొంత బ్యానర్లో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది.
దీని తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిరు సినిమా చేయనున్నారు. ఈ విషయం ఎప్పుడో ఖరారు అయింది. అయితే ఏ దర్శకుడిని ఎంచుకోవాలో ఆలోచనలో ఉన్న అల్లు అరవింద్ రీసెంట్ గా ఓ నిర్ణయానికి వచ్చారు. మాస్ పల్స్ తెలిసిన బోయపాటి అయితే బాగుంటుందని భావించారు. చిరంజీవి కూడా అతని టేకింగ్ పై మంచి అభిప్రాయం ఉంది. అందుకే మంచి కథ రెడీ చేయమని చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్న బోయపాటి శ్రీను.. ఈ సినిమాను త్వరగా పట్టాలెక్కించి చిరు కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నట్లు అయన సన్నిహితులు వెల్లడించారు.