‘ఆర్.ఎక్స్.100’ హీరోతో బోయపాటి చిత్రం?

బోయపాటి శ్రీను … మాస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్స్…! ‘భద్ర’ ‘తులసి’ వంటి సూపర్ హిట్లు సాధించిన తరువాత బాలకృష్ణ తో ‘సింహా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వరుస ప్లాపులతో ఉన్న బాలకృష్ణ పని ఇక అయిపొయింది అనుకున్న తరుణంలో ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి… నిలబెట్టాడు. ఇక ఈ చిత్రంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా బోయపాటి పై దృష్టి పెట్టింది. తరువాత కూడా ‘సరైనోడు’ ‘లెజెండ్’ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. మధ్యలో వచ్చిన ‘దమ్ము’ పర్వాలేదనిపించింది.

అయితే తరువాత వచ్చిన ‘జయ జానకి నాయక’ చిత్రం ప్లాప్ గా మిగిలింది. సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ భారీ బడ్జెట్ అవ్వడం వలన బ్రేక్ ఈవెన్ కాలేదు. అది హీరో అకౌంట్ లోకి వేసేసుకోవచ్చు. కానీ ఈ ఏడాది వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం డిజాస్టర్ అవ్వడమే కాదు ఇండస్ట్రీ మొత్తం బోయపాటి అంటే భయపడేలా చేసింది. ఈ చిత్రంతో నాగార్జున కూడా అఖిల్ ను బోయపాటి నుండీ దూరం చేసాడని టాక్ వచ్చింది. ఇక బాలయ్య కూడా బోయపాటిని పక్కన పెట్టి కె.ఎస్.రవికుమార్ తో సినిమా చేసుకుంటున్నాడు. ఇక చేసేదేమీ లేక బోయపాటి ఓ యంగ్ హీరోని లైన్లో పెట్టాడట. ఆ యంగ్ హీరో మరెవరో కాదు ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ. అవును కార్తికేయ తో బోయపాటి ఓ చిత్రం చేస్తున్నాడట. కార్తికేయ సొంత బ్యానర్లోనే ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus