Boys Hostel Movie Review in Telugu: బాయ్స్ హాస్టల్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 26, 2023 / 03:54 PM IST

Cast & Crew

  • ప్రజ్వల్ (Hero)
  • NA (Heroine)
  • మంజునాథ్ నాయక , రాకేష్ రాజ్ కుమార్, శ్రీవత్స శ్యామ్, తేజస్ జయన్న తదితరులు.. (Cast)
  • నితిన్ కృష్ణమూర్తి (Director)
  • ప్రజ్వల్ - వరుణ్ కుమార్ గౌడ - నితిన్ కృష్ణమూర్తి - అరవింద్ కశ్యప్ (Producer)
  • బి.అజనీష్ లోక్నాధ్ (Music)
  • అరవింద్ ఎస్.కశ్యప్ (Cinematography)
  • Release Date : ఆగస్ట్ 26, 2023

“హాస్టల్ హుడుగారు బేకాగిద్దరే” అనే కన్నడ సినిమా గత నెల విడుదలై కర్ణాటకలో మాత్రమే కాక సౌత్ మొత్తం రచ్చ చేస్తోంది. సినిమా చూసినవాళ్ళందరూ పడీపడీ నవ్వుకుంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులకు అందించారు చాయ్ బిస్కెట్ సంస్థ. మరి ఈ కన్నడ యూత్ ఫుల్ డార్క్ కామెడీ మనోళ్ళని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: తెల్లారితే పరీక్ష పెట్టుకొని షార్ట్ ఫిలిమ్ తీయడం కోసం హాస్టల్ వార్డెన్ రమేష్ (మంజునాధ్ నాయక)తో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు అజిత్ (ప్రజ్వల్). హాస్టల్ వార్డెన్ చనిపోయాడని అందర్నీ భయపెట్టి.. వార్డెన్ శవాన్ని హాస్టల్ నుంచి బయటకు తీసుకురావడానికి హాస్టల్ బాయ్స్ అందరూ ఎంత కష్టపడ్డారు? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: అందరూ కొత్తవాళ్లే. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన నటులెవ్వరూ లేరు. మధ్యమధ్యలో రిషబ్ శెట్టి, కన్నడ డైరెక్టర్ పవన్ కుమార్, నటుడు-దర్శకుడు తరుణ్ భాస్కర్, రష్మీ గౌతమ్ వస్తూ పోతుంటారు. అయితే.. అందరికంటే ఎక్కువగా కష్టపడింది మాత్రం వార్డెన్ గా నటించిన మంజునాధ్. బ్రతికున్న శవంగా అదరగొట్టాడు. ఇక హాస్టల్ బాయ్స్ గా కుర్రాళ్ళందరూ జీవించేశారు.

సాంకేతికవర్గం పనితీరు: కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన సినిమా ఇది. అందువల్ల.. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఎన్నో ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీమ్స్ & ట్రోల్స్ ఫాలో అయ్యే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లందరికీ విపరీతంగా కనెక్ట్ అవుతుందీ చిత్రం. తెలుగు డబ్బింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి. అయితే.. రకరకాల యాసలు ఇరికించాలని చేసిన ప్రయత్నం మాత్రం లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సంస్థ తెలుగులో అనువదించిన ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలను గుర్తుచేసింది.

అలాగే.. రష్మీతో షూట్ చేసి యాడ్ చేసిన సీన్స్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. కెమెరా వర్క్, మ్యూజిక్, ఎడిటింగ్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్. ఇలా కూడా చేయొచ్చా అనిపించేలా చేశాయి. ఫౌండ్ ఫుటేజ్ ఫార్మాట్ తరహాలో ఈ సినిమా కూడా ఉండడం మరింత ప్లస్ అయ్యింది. అలాగే తక్కువ నిడివి కూడా సినిమాకు హెల్ప్ అయ్యింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేసిన నిర్మాతలు పేర్కొన్నట్లు.. ఒక పాయింట్ గా చెబితే ఏ నిర్మాత కూడా ఈ చిత్రాన్ని రూపొందించడానికి ముందుకు రాడు. అందుకే స్నేహితులందరూ కలిసి ఈ సినిమాను రూపొందించారు. దర్శకుడు నితిన్ కృష్ణమూర్తి తీసుకున్న సినిమాటిక్ లిబర్టీస్ & యూత్ ఫుల్ మూమెంట్స్ ఈ సినిమాను నిలబెట్టాయి. దర్శకుడిగా, కథకుడిగా నితిన్ టీం వర్క్ తో నెగ్గుకొచ్చిన విధానం అభినందనీయం.

విశ్లేషణ: ఒక టిపికల్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ చిత్రాన్ని యూత్ ఆడియన్స్ కచ్చితంగా చూడొచ్చు. అయితే.. ఈ సినిమా బాగుందని స్టేట్మెంట్ ఇవ్వలేమ్, బాలేదని కామెంట్ చేయలేం, ఇది కొత్తతరం సినిమా మేకింగ్ అంటూ జస్టిఫికేషన్ కూడా ఇవ్వలేమ్. ఎందుకంటే.. ఈ సినిమా ఒక ప్రయత్నం. పొరపాటున ఈ మేకింగ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎవరైనా ఇంకో సినిమా తీస్తే అది జనాల్ని ఆకట్టుకునే అవకాశం చాలా తక్కువ.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus