Brahmaji: అనసూయ పై పరోక్షంగా కౌంటర్ వేసిన బ్రహ్మాజీ..!

సీనియర్ నటుడు బ్రహ్మాజీ అంటే తెలియని ప్రేక్షకులంటూ ఉండరు. ఈరోజు ఆయన చాలా డీప్ గా హర్ట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బ్రహ్మాజీ కి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. ఛాన్స్ దొరికిన ప్రతీసారి ప్రపంచ దేశాలన్నీ తిరిగేసి రావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఇందులో భాగంగా.. బ్రహ్మాజీ చంఢీఘర్ నుంచి కులుకు ఫ్లైట్‌లో వెళ్లేందుకు సిద్దమయ్యాడు. కానీ ఈ ఫ్లైట్ ఆలస్యం అయ్యింది. అది కూడా 5 గంటలు లేట్ అయ్యింది. ఆ ఎయిర్ లైన్స్ సంస్థ కూడా ఫ్లైట్ లేట్ అవుతుంది అని ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

ఈ అసౌకర్యానికి చింతిస్తూ కనీసం సారి కూడా ఆ సంస్థ తెలపలేదని బ్రహ్మాజీ మండి పడ్డాడు. ఐదున్నర గంటల తర్వాత ఫ్లైట్ వచ్చింది. నేను అలియన్స్ ఎయిర్ లైన్స్ రిప్లైలను ఆశించడం లేదు అంటూ బ్రహ్మాజీ తెలిపాడు. ఎందుకంటే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అంటూ సెటైర్లు వేశాడు బ్రహ్మాజీ. అటు తర్వాత నెటిజెన్లతో చిట్ చాట్ చేస్తూ ఉండగా బ్రహ్మాజీని ఓ నెటిజన్ అంకుల్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి బ్రహ్మాజీ.. ‘అంకుల్ ఏంట్రా.. అంకుల్, కేసు వేస్తా, ఏజ్, బాడీ షేమింగ్ ఆ? ‘ అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు.

ఇవి ఫన్నీ కామెంట్స్ ఏంటి? అని మీరు అనుకోవచ్చు. బ్రహ్మాజీ ఇలాంటి కామెంట్లకు అనవసరంగా తన ఎమోషన్స్ ను వేస్ట్ చేసుకోడు. చాలా సెన్సిబుల్ పర్సన్. ఇది పరోక్షంగా అనసూయ పై సెటైర్ అనుకోవచ్చు. ఇటీవల ‘ఆంటీ’ అన్నందుకు ఆమె చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. కేసులు వేస్తానంటూ మొత్తానికి ఆమె అన్నంత పని చేసింది.అయితే ఇప్పుడు బ్రహ్మాజీ వేసిన సెటైర్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus