Brahmaji: కొండా సురేఖ కామెంట్లపై వ్యంగ్యంగా స్పందించిన బ్రహ్మాజీ.. ఏమన్నారంటే?

  • October 5, 2024 / 12:47 PM IST

తెలంగాణ మినిష్టర్ కొండా సురేఖ సమంత అక్కినేని ఫ్యామిలీ టార్గెట్ గా చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అయ్యాయనే సంగతి తెలిసిందే. సెలబ్రిటీల నుంచి కొండా సురేఖ కామెంట్లపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది. దాదాపుగా అందరు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వివాదం గురించి రియాక్ట్ అయ్యారనే సంగతి తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ కొండా సురేఖ విషయంలో ఒకింత ఘాటుగా రెస్పాండ్ అయ్యారు.

Brahmaji

నాగార్జున ఇప్పటికే ఈ వివాదానికి సంబంధించి పరువు నష్టం దావా వేయగా కొండా సురేఖ తాను ఈ వివాదం గురించి మాట్లాడనని మాట్లాడాల్సింది అంతా నిన్నే మాట్లాడానని దానిని ఇంకా పొడిగించవద్దని కామెంట్లు చేశారు. మరోవైపు చైతన్య సమంత ఎందుకు విడిపోయారా చెప్పారా అంటూ ఆమె కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కామెంట్స్ పై బ్రహ్మాజీ ఒకింత వ్యంగ్యంగా రియాక్ట్ అయ్యారు.

ఎందుకు విడిపోయారో మీకు చెప్పాలా.. మంత్రిగారు అంటూ బ్రహ్మాజీ కామెంట్లు చేయడం గమనార్హం. బ్రహ్మాజీ ట్విట్టర్ వేదికగా ఏ ట్వీట్ చేసినా సంచలనం అవుతుంది. బ్రహ్మాజీ చేసిన కామెంట్ కు 4600కు పైగా లైక్స్ వచ్చాయి. మరోవైపు కోర్టు నాగ్ దాఖలు చేసిన పిటిషన్ గురించి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.


అక్కినేని ఫ్యామిలీ గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ఘాటుగా స్పందించిన సందర్భాలు లేవనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఎంతో మనోవేదనకు గురై ఉంటే మాత్రమే నాగార్జున కోర్టు మెట్లు ఎక్కి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జున ఈ వివాదాల వల్ల మానసికంగా డిస్టర్బ్ అవుతున్నారని సమాచారం అందుతోంది. నాగార్జున రెమ్యునరేషన్ ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలో ఉంది. నాగార్జున తర్వాత ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సత్తా చాటాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కళ్యాణ్ రామ్ ఇకపై ఆ ప్రాజెక్ట్ లను మాత్రమే నిర్మించనున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus