Jr NTR: కళ్యాణ్ రామ్ ఇకపై ఆ ప్రాజెక్ట్ లను మాత్రమే నిర్మించనున్నారా?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తే మెజారిటీ సినిమాలు నిరాశపరిచాయి. కిక్2 సినిమాను కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తే ఆ సినిమాకు ఊహించని స్థాయిలో నష్టాలు వచ్చాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాలు మాత్రం సక్సెస్ సాధిస్తున్నాయి.

Jr NTR

జై లవకుశ సినిమాకు కళ్యాణ్ రామ్ సోలో నిర్మాతగా వ్యవహరించగా దేవర సినిమాను మాత్రం యువసుధ ఆర్ట్స్ తో కలిసి నిర్మించారు. అప్పుడు జై లవకుశ ఇప్పుడు దేవర కళ్యాణ్ రామ్ కు మంచి లాభాలను అందించాయని తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే దేవర సినిమాకు 240 నుంచి 250 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగడం గమనార్హం.

ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకున్న దేవర శని, ఆదివారాల్లో భారీ స్థాయిలోనే కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. దసరా సెలవులు ఈ సినిమాకు ప్లస్ కానుండగా త్వరలో సాధారణ టికెట్ రేట్లతో ప్రదర్శితం కానుండటం ఈ సినిమాకు ప్లస్ కానుందని చెప్పవచ్చు. వార్2 మినహా ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సైతం కళ్యాణ్ రామ్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

కళ్యాణ్ రామ్ ఇకపై నందమూరి హీరోల సినిమాలను మాత్రమే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించే ఛాన్స్ ఉంది. దేవర సినిమా ఎన్నో నెగిటివ్ సెంటిమెంట్లను సైతం బ్రేక్ చేసింది. 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో దేవర ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ ను దేవర దాటడం పక్కా అని చెప్పవచ్చు. మాస్ సినిమాలు సైతం పాన్ ఇండియా హిట్లుగా నిలుస్తాయని దేవర మూవీతో ప్రూవ్ అయింది. ఈరోజు నుంచి దావూది సాంగ్ కూడా థియేటర్లలో ప్రదర్శితం అవుతోంది.

కన్నబిడ్డను కోల్పోయిన నటకిరీటి రాజేంద్రప్రసాద్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus