బ్రహ్మానందం (Brahmanandam) నటుడిగా ఇప్పటి తరానికి తెలుసు. కానీ ఆయన నటుడు కాకముందు ఓ లెక్చరర్. పిల్లలకు పాఠాలు చెబుతూ, విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ల ఉన్నతికి పాల్పడ్డారు. ఓ క్షణంలో సినిమాలవైపు అనుకొని వచ్చి.. ఆ తర్వాత మెగాస్టార్ (అప్పటికి కాదు) చిరంజీవి సాయంతో సినిమా వాళ్లకు పరిచయమయ్యారు. ఇప్పుడు 1200కి పైగా సినిమాల్లో నటించి కామెడీ కింగ్ అయ్యారు. అయితే ఇంత జరిగినా ఆయనెప్పుడూ తొలినాటి రోజుల్ని మరచిపోలేదు.
బ్రహ్మానందం ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో బ్రహ్మానందం చెప్పిన కొన్ని విషయాలు, చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. వ్యక్తి, ప్రవర్తన, ఆలోచన, తీరు లాంటి విషయాల గురించి మాట్లాడారు బ్రహ్మానందం. ఆ మాటలు వింటుంటే ఇటీవల చిరంజీవి (Chiranjeevi) నోరు జారి మాట్లాడిన మాటల్ని మరీ సీరియస్‌గా తీసుకోవద్దు అని చెప్పినట్లు అయింది. అయితే చిరంజీవి మాటలు అనకముందు ఈ ఇంటర్వ్యూ రికార్డు చేయడం వల్ల ఆ చిరు మాటకు బ్రహ్మానందం రియాక్ట్ అయినట్లు కాదు అని చెప్పాలి.
ఏదో ఒక సందర్భంలో, ఓ మూడ్‌లో ఓ వ్యక్తి అన్న మాటల్ని పట్టుకుని అతని కేరక్టర్‌ని అంచనా వేయడం సరికాదు. ఆయన ఎందుకు అలా మాట్లాడారు, ఆ విషయం వదిలేస్తే ఆయన ఎలాంటి వాడు అనే వివరాలు మన పట్టించుకోవాలి. ఒక్క విషయంలో ఇబ్బంది వస్తే ఆ వ్యక్తిని ఒక గాటన కట్టేయడం సరికాదు అని బ్రహ్మానందం చెప్పారు. ఆ సందర్భంలో, ఏదో ఆలోచనలో, ఓ మాడ్యులేషన్ మాట్లాడిన విషయాలు అంటూ బ్రహ్మీ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో బ్రహ్మానందం నటుడు అవ్వడానికి చిరంజీవి పడ్డ శ్రమ అనే విషయం ముందు మిగిలిన కామెంట్ విషయం చిన్నదే. ఆయన అలా ఎందుకు మాట్లాడాడు అనేది ఆయన ఇష్టం. కాబట్టి ఈ విషయంలో ఇక్కడితో వదిలేస్తే బాగుంటుంది అనేది నెటిజన్ల సూచన. నిజానికి ఈ విషయంలో ఇప్పటికే చిరు మాట్లాడి, క్లారిటీ వచ్చి ఉంటే బాగుండు అనే వాదన కూడా వినిపిస్తోంది.