Brahmanandam: నేను సంపాదించుకున్న ఆస్తి ఎమ్మెస్‌ నారాయణ.. బ్రహ్మానందం ఇలా ఎందుకన్నారు?

డబ్బులు, ఆస్తులు, అంతస్థులు కాదు.. వాటన్నింటికి మించి సంతోషాన్ని ఇచ్చేది ఇంకొకటి ఉంటుంది అని చెబుతారు పెద్దలు. అదే ఓ మనిషి అభిమానం, నమ్మకం, ప్రేమ పొందడం. ఈ విషయం ఏమైనా డౌట్‌ ఉంటే రీసెంట్‌ బ్రహ్మానందం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ చూడండి. ఆయన తన జీవితంలో సంపాదించుకున్న అతి పెద్ద, గొప్ప ఆస్తి ఏంటి అనేది చెప్పారు. ఆ మాటలు వింటుంటే మనం కూడా అలాంటి ఓ ఫీలింగ్‌ని ఫేస్‌ చేయాలి అనిపిస్తుంది.

Brahmanandam

టాలీవుడ్‌ కమెడియన్లలో బ్రహ్మానందం (Brahmanandam)  ఓ శిఖరం అయితే, ఆ స్థాయి ప్రేమాభిమానులు అందుకున్న మరో కమెడియన్‌ ఎమ్మెస్‌ నారాయణ. ఆయన చివరి రోజుల్లో జరిగిన ఓ విషయం గురించి బ్రహ్మానందం ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెస్‌ నారాయణ (M. S. Narayana)  ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు ఆఖరి రోజున తన కుమార్తెను ఎమ్మెస్‌ నారాయణ పిలిచి.. పేపర్‌ మీద బ్రహ్మ అన్నయ్యను కలవాలని ఉంది. పిలిపించు అని రాశారట.

ఆ తర్వాత ఎమ్మెస్‌ తనయ.. బ్రహ్మానందానికి ఫోన్‌ చేసి విషయం చెబితే ఆయన ఏదో షూటింగ్‌లో ఉండటంతో పర్మిషన్‌ తీసుకొని ఆసుపత్రికి వచ్చారట. అప్పుడు ఆయన చేతిని పట్టుకుని ఎమ్మెస్‌ నారాయణ అలా కాసేపు ఉండిపోయారట. ఆ సమయంలో ఎమ్మెస్‌ కళ్ల నుండి కన్నీరు అలా జారుతూ వచ్చిందట. ఆ సమయంలో అంత మంది కుటుంబ సభ్యులు ఉన్నా తనను పిలిచాడు అంటే ఎంత అభిమానం, ప్రేమ ఉండి ఉండాలి. ఇదే నేను సంపాదించుకున్న ఆస్తి అని బ్రహ్మానందం చెప్పారు.

ఈ క్రమంలో ఎమ్మెస్‌ నారాయణ గురించి, ఆయన కామెడీ టైమింగ్‌ గురించి, జీవితాన్ని ఆయన నడిపించిన తీరు గురించి బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. తనతో ఎమ్మెస్‌ సరదాగా ఉన్న నాటి విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.

ఇలా అయితే అస్సలు సరిపోవు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus