దర్శకత్వంపై సీనియర్ కమెడియన్ స్పందన…

టాలీవుడ్ సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం త్వరలో మెగాఫోన్ పట్టి “యాక్షన్.. కట్..” చెప్పనున్నారని ఇటీవల వార్తలు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇంతటితో ఆగక అందులో రేష్మి, అనసూయ నటిస్తున్నారంటూ ఆద్యంలో పోయడంతో ఈ విషయం మరింత వేగంగా వెబ్ ప్రపంచాన్ని చుట్టేసింది. ఇంతదాకా వచ్చింది బ్రహ్మి చెవిన మాత్రం పడకుండా ఎందుకు ఉంటుంది. ఈ ముచ్చట కాస్త తెలుసుకున్న బ్రహ్మీ కింది విధంగా సమాధానమిచ్చారు.

తాను దర్శకత్వం చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు బ్రహ్మానందం. దర్శకత్వమే చేయాలనుకుంటే ఎప్పుడో చేయాల్సిందని ఇప్పుడు దానికి జోలికి పోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చిన ఈ హాస్య నటుడు ఎన్నాళ్ళుగానో తాను రాసుకొస్తున్న పద్యాలను అచ్చు వేయించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిపారు. స్వతహాగా తెలుగు పండితుడైన బ్రహ్మీ పద్యాలు రాయడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ అవి దీనిపై రాశారన్నది ఆసక్తికరం. ఇదిలా ఉంటే బ్రహ్మీ తనయుడు గౌతమ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ఫనీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు త్వరలో ఆరంభించనున్నారు.

Comedian Brahmanandam with Anasuya and Rashmi - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus