కోట్ల రూపాయలు సంపాదించేసిన లెజెండ్ బ్రహ్మానందంకి (Brahmanandam) డబ్బుల కొదవ ఏముంది అనుకుంటున్నారేమో. ఇక్కడ మాట్లాడుకుంటుంది బ్రహ్మానందం వాళ్ళబ్బాయితో కలిసి నటించిన “బ్రహ్మ ఆనందం” (Brahma Anandam) సినిమా గురించి. అనౌన్స్మెంట్ టైమ్ నుంచి మంచి ఆసక్తి నెలకొల్పిన ప్రాజెక్ట్ ఇది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఓ సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ప్లే చేయడం, “మళ్లీ రావా (Malli Raava) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'(Agent Sai Srinivasa Athreya) ‘మసూద’ (Masooda)” చిత్రాలతో హ్యాట్రిక్ హిట్ అందుకొని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ను బ్రాండ్ గా క్రియేట్ చేసిన రాహుల్ యాదవ్ నక్క (Rahul Yadav Nakka) నిర్మించడం కారణాలుగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
టీజర్ వరకు ఆ అంచనాలు అలానే ఉన్నాయి కానీ.. ట్రైలర్ సదరు అంచనాలను కాస్త సన్నగిల్లేలా చేయగా.. సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేక చతికిలపడిన మాట వాస్తవం. అయితే.. అదేరోజు విడుదలైన “లైలా” (Laila) డిజాస్టర్ గా నిలవడంతో, “బ్రహ్మ ఆనందం” చిత్రానికి కాస్త ప్లస్ అయ్యింది. ఈవారం అందరూ ఈ సినిమాకి వెళ్తారు అనుకున్నారు. కట్ చేస్తే.. ఈ రెండు సినిమాలు కాదని ప్రేక్షకులందరూ “తండేల్” (Thandel) వైపు మొగ్గుచూపారు.
అయితే.. రాహుల్ యాదవ్ మాత్రం “బ్రహ్మ ఆనందం” సినిమాకి సక్సెస్ మీట్ సైతం నిర్వహించి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి సక్సెస్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. అయినా కానీ.. కలెక్షన్స్ మాత్రం అస్సలు ఇంప్రూవ్ అవ్వడం లేదు. నిజానికి రాహుల్ ఈ సినిమా విషయంలో చాలా లక్కీ.. ఎందుకంటే రిలీజ్ కి ముందే వరల్డ్ వైడ్ రైట్స్ ను వంశీ నందిపాటికి మంచి లాభానికి అమ్మేశాడు.
అయితే.. నిర్మాతగా తన ఇమేజ్ ను నిలబెట్టుకోవడం కోసం రిలీజ్ తర్వాత ప్రమోషన్స్ డోస్ పెంచాడు. ఇన్ని చేస్తున్నా జనాలు థియేటర్లకి రావడం లేదు. మరి “బ్రహ్మ ఆనందం”కి టైమ్ ఫిబ్రవరి 26 వరకే. ఆ తర్వాత సినిమాని థియేటర్ల నుండి తీసేయడం ఖాయం. మరి ఈలోపు బ్రహ్మానందం కనీస స్థాయి కలెక్షన్స్ సాధించగలుగుతాడో లేదో చూడాలి.