Brahmanandam: బ్రహ్మానందానికి సొంతమైన ఈ అరుదైన రికార్డ్ గురించి మీకు తెలుసా?

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల సక్సెస్ లో బ్రహ్మానందం పాత్ర ఉంటుంది. బ్రహ్మానందం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించిన టాలీవుడ్ కమెడియన్ కాగా 1150కు పైగా సినిమాలలో ఆయన నటించారు. అయితే బ్రహ్మానందం పేరుపై ఉన్న రేర్ రికార్డ్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బ్రహ్మానందం ఒకే ఏడాది ఏకంగా 51 సినిమాలలో నటించడం గమనార్హం.

1993 సంవత్సరంలో బ్రహ్మానందం ఇన్ని సినిమాలలో నటించి అరుదైన రికార్డ్ ను ఖాతాలో వేసుకున్నారు. ఈ రికార్డ్ ఎప్పటికీ బ్రేక్ కాని రికార్డ్ అని ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మానందం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కల్కి ప్రీల్యుడ్ ఇంగ్లీష్ వెర్షన్ లో తన పాత్రకు బ్రహ్మానందం తనే డబ్బింగ్ చెప్పుకున్నారని సమాచారం అందుతోంది.

బ్రహ్మానందం ఒకానొక సమయంలో తన రెమ్యునరేషన్ కు సంబంధించిన విషయాల ద్వారా వార్తల్లో నిలిచారు. బ్రహ్మానందం రోజుకు 10 లక్షల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న నటులలో ఒకరు కావడం గమనార్హం. బ్రహ్మానందం కామెడీ సీన్స్ కు యూట్యూబ్ లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం బ్రహ్మానందం వయస్సు 68 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ కు ఈ జనరేషన్ కు చెందిన వాళ్లు సైతం ఫ్యాన్స్ ఉన్నారు.

పాన్ ఇండియా డైరెక్టర్లు బ్రహ్మానందంకు తమ సినిమాలలో ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మానందం రేంజ్ అంతకంతకూ పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్రహ్మానందంకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. బ్రహ్మానందంకు ఇతర భాషల్లో సైతం ఇప్పటికే మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus