నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది : హీరో గౌతమ్

ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు పద్మశ్రీ, డా: బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని ఆయన తనయుడు హీరో గౌతమ్ తెలిపారు. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్‌ని సంప్రదించారు బ్రహ్మానందం. వారి సలహా మేరకు శస్త్ర చికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు. దేశంలోనే అత్యుత్తమమైన ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ‘ లో సోమవారం ( 14.1.19 ) నాడు గుండె ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ హృదయ చికిత్స నిపుణులు శ్రీ రమాకాంత్ పాండా బ్రహ్మానందం గారికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.

ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చటం జరిగింది అని తెలిపారు. నాన్నగారికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమ లోని ప్రముఖులు అందరూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయటం మొదలు పెట్టారు. అందరి ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉందని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్దార్థ్‌లు తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus