హాలీవుడ్ లో హిట్టయిన “బ్రహ్మోత్సవం” కాన్సెప్ట్!

  • November 27, 2017 / 12:02 PM IST

మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తోపాటు కాజల్, సమంత, ప్రణీత లాంటి లేడీ స్టార్స్, సత్యరాజ్, రేవతి, రావురమేష్, నాజర్ వంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ ఉండి కూడా కేవలం సరైన స్క్రీన్ ప్లే లేని కారణంగా డిజాస్టర్ అయిన “బ్రహ్మోత్సవం”ను మహేష్ బాబు అభిమానులే కాదు ఆ సినిమాను ఫస్ట్ డే థియేటర్లో చూసినవాళ్ళెవరూ కూడా అంత సులువుగా మర్చిపోలేరు. కానీ.. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఆ సినిమా ద్వారా శ్రీకాంత్ అడ్డాల చెప్పాలనుకొన్నది మాత్రం చాలా గొప్ప విషయం. “మనిషి ఎక్కడికెళ్లినా, ఎంత ఎత్తు ఎదిగినా.. తన మూలాలు మరువకూడదు” అనే అద్భుతమైన విషయాన్ని కూడా తన సినిమా ద్వారా అందరికీ చెప్పాలనుకొన్నాడు. సినిమా దారుణమైన పరాజయం పాలవ్వడంతో ఆ మెసేజ్ ఎవ్వరికీ చేరలేదు.

కానీ.. ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో హాలీవుడ్ లో రూపొందిన “కోకో” (COCO) అనే సినిమా అందరి మనుసులకు హత్తుకుంటూ అఖండ విజయం సాధించింది. యానిమేషన్ సినిమా కావడమే కాక ప్రతి పాత్ర ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే స్థాయిలో ఉండడంతో చిన్నాపెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరూ చిత్రాన్ని విశేషంగా ఆదరిస్తున్నారు. డిస్నీ సంస్థ రూపొందించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. ఇప్పటివరకూ హాలీవుడ్ లో రిలీజైన అన్నీ యానిమేషన్ సినిమాలతో కంపేర్ చేస్తే “కోకో” ది బెస్ట్ ఫీల్ గుడ్ ఫిలిమ్ అని విమర్శకులు కూడా తేల్చేయడంతో కలెక్షన్స్ పరంగానూ ఈ సినిమా రికార్డ్స్ కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus