మే 7న సూపర్‌స్టార్‌ మహేష్‌ ‘బహ్మోత్సవం’ ఆడియో

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పి.వి.పి. సినిమా, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ స్టోరీ ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రం ఆడియోను మే 7న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ – ”మా ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్‌ పోస్టర్‌ను విడుదల చేశాం. మే 7న హైదరాబాద్‌లో ఈ చిత్రం ఆడియోను రిలీజ్‌ చేస్తున్నాం. మిక్కీ జె.మేయర్‌ చాలా అద్భుతమైన మ్యూజిక్‌ని అందించారు. ఒక అద్భుతమైన కథతో, అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ తారాగణంతో ఈ చిత్రం రూపొందుతోంది. సూపర్‌స్టార్‌ మహేష్‌ కెరీర్‌కి, మా బేనర్‌కి ఇది ఒక ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు” అన్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus