చిత్రీకరణ చివరి దశలో ‘బ్రహ్మోత్సవం’..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం.  ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఓ పాట, కొద్దిపాటి సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉండగా.. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోనుంది. మరోవైపు తిరుపతి వేదికగా మే 1 న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను విడుదల చేయనుండగా..

మే 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం యోచిస్తోంది. ఈ రెండు విషయాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పీవీపీ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీతలు జంటగా నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags