ఆటాడుకుందాం రాలో బ్రహ్మి కొత్త స్టైల్..!

మూస పాత్రలకు మాత్రమే గుడ్ బై చెప్పానని, సినీ పరిశ్రమకు కాదని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అందరికీ చెప్పడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఆయన ఎలుక మజాకా, సోగ్గాడే చిన్ని నాయన, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు చిత్రాల్లో కనిపించారు. దీంతో బ్రహ్మి పని అయిపోయిందని వార్తలు వెలువడ్డాయి. యువ కమెడియన్లు రాకతో ఆయన కెరీర్ చివరి దశకు వచ్చేసిందని.. అందుకే బ్రహ్మీ సినిమాలకు గుడ్ బై చెపుతున్నాడన్న రూమర్లు చక్కర్లు కొట్టాయి.

ఇవి పద్మశ్రీ అందుకున్న హాస్య నటుడిని గాయపరిచాయి.. అయినా ఎవరినీ ఒక్క మాట అనకుండా తన నటనతోనే సమాధానము చెప్పాలని అనుకున్నారు.  జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సుశాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన “ఆటాడుకుందాం..రా” చిత్రంలో బ్రహ్మానందం కీలక రోల్ పోషించారు. ఇంతవరకు స్లాపింగ్ కామెడీతో అదరగొట్టిన  బ్రహ్మి ఇందులో కొత్త స్టైల్ ల్లో నవ్వులను పూయించనున్నారు. అరుపులు, భయాలు లేకుండా సహజమైన సన్నివేశాలకు తన మార్కు హావభావాలతో హాస్యాన్ని పండించనున్నారు. రీసెంట్ గా విడుదలైన ఆటాడుకుందాం రా ట్రైలర్ చూసిన వారంతా.. “బ్రహ్మి ఈజ్ బ్యాక్” అంటున్నారు. “ఈ కాఫీ తాగి నా కోరిక తీర్చండి” అని లేడీ ఆర్టిస్ట్ అడిగితే అందుకు బ్రహ్మి ఇచ్చే రియాక్షన్ అదిరిపోయింది.

ఇదివరకు అనేక సినిమాల్లో  ఫ్రస్టేషన్ తో రెచ్చిపోయే అతనిలో సైలంట్ గా “కోరిక..ఏ..” అనే ఎక్స్ ప్రెషన్ కొత్తగా ఉంది. ఈ ఒక్క డైలాగ్ చాలు అతను ఆటాడుకుందాం రాలో ఎంతలా నవ్వించనున్నాడో తెలియడానికి. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మించిన ఈ మూవీ  ఈనెల 19 న రిలీజ్ కానుంది. ఇందులో బ్రహ్మి  స్టైల్ చూసి ఆయనకోసం దర్శకులు ప్రత్యేక పాత్రలు సృష్టిస్తారని సినీ ప్రముఖులు చెబుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus