‘అదుర్స్’ తో 2010 సంక్రాంతికి ఓ సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్… అదే ఏడాది ‘బృందావనం’ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అంటే మొదట పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే.. దానికి దర్శకుడు వంశీ పైడిపల్లి. అప్పటికి అతను ఒక్క సినిమా మాత్రమే తీశాడు. అదే ‘మున్నా’. అది అంతగా ఆడలేదు. వంశీ డైరెక్షన్ టాలెంట్ కూడా పెద్దగా బయటపడలేదు. మరోపక్క దిల్ రాజు ఆ టైంలో వరుస ప్లాపుల్లో ఉన్నారు.
అలాగే మహేష్ బాబు- త్రివిక్రమ్..ల ‘ఖలేజా’ టైంలో ‘బృందావనం’ రావడం వల్ల మొదట్లో ఆడియన్స్ ఈ సినిమాపై దృష్టి పెట్టలేదు. ఫైనల్ గా 2010 అక్టోబర్ 14న పెద్దగా అంచనాలు లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బృందావనం’ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది ‘బృందావనం’ సినిమా. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
ఈ సందర్భంగా ఒకసారి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 8.3 cr |
సీడెడ్ | 6.54 cr |
ఉత్తరాంధ్ర | 2.95 cr |
ఈస్ట్ | 1.6 cr |
వెస్ట్ | 1.56 cr |
గుంటూరు | 2.73 cr |
కృష్ణా | 1.83 cr |
నెల్లూరు | 1.3 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 26.81 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.42 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 30.23 కోట్లు(షేర్) |
‘బృందావనం’ (Brindavanam) చిత్రం రూ.24.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.30.23 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా బయ్యర్లకు రూ.5.53 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.